టాలీవుడ్ లో సీనియర్ నటుడుగా పేరుపొందిన సుమన్ ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో కూడా కనిపిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు జరిగిన విషయాలతో పాటుగా, సినీ ఇండస్ట్రీ, తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా పంచుకున్నారు. ఇలాంటి సందర్భంలోనే హీరో సుమన్ ,అల్లు అర్జున్ పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ గంగోత్రి సినిమాలో తండ్రి కొడుకులుగా నటించారు. ఈ విషయం పైన అల్లు అర్జున్ హీరో మొట్టమొదటి చిత్రంలో మీరు తండ్రి పాత్ర పోషించారు. ఆ సినిమాతో అతనికి పెద్దగా పేరు రాలేదు కదా.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. మీ ఫీల్ ఎలా ఉందని యాంకర్ సుమన్ ని ప్రశ్నించారు.


అందుకు హీరో సుమన్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ కి తండ్రిగా గంగోత్రి చిత్రంలో తన నటించాను ఆ సమయంలో ఇంత పెద్ద స్టార్ అవుతాడని అసలు అనుకోలేదు. అల్లు అరవింద్ గారు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి తాను ఇండస్ట్రీలో అయితే ఉంటాడనుకున్నాను.. కట్ చేస్తే ఈరోజు పాన్ ఇండియా హీరోగా చేరుకోవడం ఊహించలేదని తెలిపారు. ఈ విషయాన్ని తానే కాదు ఇండస్ట్రీలో ఎవరు ఊహించలేదని తెలిపారు.


ఇదంతా కూడా అల్లు అర్జున్ హార్డ్ వర్క్ ,  టైం కలిసి రావడం వల్ల సాధ్యమైంది అనుకుంటాను అంటూ తెలిపారు. తాము నటించే రోజులలో పాన్ ఇండియా ఇమేజ్ అనేవి ఉండేవి కాదనీ తెలిపారు. అయితే అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ హీరో మొదటి చిత్రంలో తన తండ్రి పాత్ర చేసినందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ తెలిపారు సుమన్. గంగోత్రి చిత్రంలో అల్లు అర్జున్ సింహాద్రి అనే టీనేజ్ కుర్రాడి పాత్రలో నటించారు. ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ ని చాలామంది ట్రోల్ చేసిన ఆ తరువాత తన సినిమాలతో తనని నిరూపించుకున్నారు అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: