ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ,కృష్ణంరాజు వంటి వారు ఉండేవారు. దీనివల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ పొజిషన్ లో ఉందని చెప్పవచ్చు. అయితే ఈ తరం తర్వాత అంతగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న వాళ్ళలో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లు ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అంటే కూడా వీరే. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ  వీరి తరంలో చాలావరకు మల్టీ స్టారర్ చిత్రాల్లో  నటించేవారు. ఆ సమయంలో వీరు కలిసి నటించి అద్భుతమైన హిట్లు సాధించేవారు. కానీ ఈ తరం హీరోలైన నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు మల్టీ స్టారర్స్ గా సినిమాలు చేయడానికి చాలా వరకు వెనుకంజ వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు.

 కానీ ఆ ఒక్క హీరో మాత్రం మల్టీ స్టారర్ సినిమాల్లో నటించడానికి ఇప్పటివరకు ఒప్పుకోలేదట. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే బాలకృష్ణ.. ఆయన దానికి కారణం కూడా తెలియజేశారు.. మరి బాలకృష్ణ మల్టీ స్టారర్స్ చేయకపోవడానికి కారణం ఏంటో చూద్దామా.. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించాలని ఎంతో మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ వీరి మధ్యలో ఆ కాంబినేషన్ అస్సలు కుదరడం లేదు. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణను యాంకర్ ఈ విధంగా ప్రశ్నించింది. నాగార్జున, వెంకటేష్, చిరంజీవి మీరు ఒకే తరానికి చెందిన హీరోలు.. మీరు మల్టీ స్టారర్స్ చిత్రాలు ఎందుకు చేయడం లేదు,

ఈగో సమస్య ఉందా అని యాంకర్ ప్రశ్నించింది.. దీనిపై బాలకృష్ణ మాట్లాడుతూ.. ఒక ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్నారు అంటే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ కావాలనేది నా అభిప్రాయం.. ముఖ్యంగా మల్టీ స్టారర్ మూవీ అంటేనే మాస్, యాక్షన్, ఫ్యామిలీ,  కామెడీ కోరుకునే ప్రేక్షకులను సంతృప్తి పరిచే విధంగా ఉండాలి. ఆ విధమైన కథ ఉంటే నేను తప్పకుండా మల్టీస్టారర్ సినిమాకి ఒప్పుకుంటాను. కానీ నా దగ్గరికి మైథలాజికల్ కథలతో మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ప్రపోజల్స్ వచ్చాయి. ఆ సినిమాలో చేయడానికి నేను ఒప్పుకున్నా ఇతర హీరోలు అంగీకరించలేదు. దీనివల్ల మల్టీ స్టారర్ సినిమాలు మిస్ అయ్యాయని ఆయన చెప్పేశారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ-2 చిత్రంలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: