ఆరోగ్యానికి అవసరమైన పోషకాలలో విటమిన్ సి చాలా ముఖ్యము ఎందుకంటే ఇది అన్ని రకాల పనులలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెంచుతూ ,రక్షణ కవచంగా మారుతుంది. విటమిన్ సి అనేది నీటిలో కరిగిపోతుంది. మన శరీరంలో నిల్వ ఉండదు అందుకే ప్రతిరోజు ఆహార పదార్థాలను తీసుకోవడం ముఖ్యం.
చలికాలంలో జీర్ణ వ్యవస్థ పనితీరును చాలా మెరుగుపరిచేలా చేస్తుంది. శరీరంలో ఐరన్ ను పెంచేలా చేస్తుంది విటమిన్ సి
విటమిన్-C శరీరానికి ఒక బూస్టర్ల పని చేస్తుంది. చర్మానికి అవసరమైన తేమను అందించడానికి సహాయపడుతుంది. అలాగే వైరస్లతో పోరాడే తెల్ల రక్తకణాలను కూడా బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. వీటికి తోడు ఇన్ఫెక్షన్ల భారీ నుంచి కూడా పోరాడే శక్తిని ఇస్తుంది.
విటమిన్ c ద్వారా చర్మం, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.
ఎముకలు దృఢంగా ఉండడానికి ప్రమాదాలలో ఎముకలు విరగకుండా ఉండడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి విటమిన్ సి చాలా ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ వంటి కణాలను సైతం పెరుగుదల లేకుండా అడ్డుకుంటుంది. గుండె జబ్బులను అరికడుతూ రక్తపోటుని క్రమబద్ధీకరిస్తుంది.
గాయాల్ని వాటి ద్వారా వచ్చే మార్చలని మానిపోయేలా చేస్తుంది.
కంటి ఆరోగ్యానికి కూడా విటమిన్ సి చాలా అవసరం, అలాగే హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.
విటమిన్ సి ఒత్తిడి, ఆందోళనను తగ్గించి హుషారుగా ఉండేలా చేస్తుంది.
అత్యధికంగా విటమిన్ సి ఉసిరి పనులలో 600 నుంచి 700 మిల్లీగ్రాములు. జామ, బొప్పాయి, కివి, పైనాపిల్, స్ట్రాబెరీ వంటి వాటిలో ఎక్కువగానే లభిస్తుంది. అలాగే కూరగాయల విషయానికి వస్తే పసుపు ఎరుపు ఆకుపచ్చ వంటి వాటిలో సమృద్ధి గానే లభిస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి