అక్కినేని నాగార్జున కెరీర్‌కి కొత్త మలుపు తీసుకువచ్చిన ఈ సినిమా, నిజ జీవితాన్ని ప్రతిబింబించే రియలిస్టిక్ టేకింగ్, యూత్‌కు దగ్గరగా ఉన్న మాస్ ఎమోషన్, మరియు ఇళయరాజా అందించిన అద్భుతమైన సంగీతంతో అప్పట్లో సెన్సేషన్ అయింది. ఇప్పుడు ఆ లెజెండరీ క్లాసిక్ మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. నవంబర్ 14న ‘శివ’ రీ-రిలీజ్ జరగబోతోంది. 36 ఏళ్ల క్రితం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ పెద్ద తెరపై చూడబోతున్నామంటే సినీ అభిమానుల్లో మరోసారి పండగ వాతావరణం నెలకొంది.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ఈ సంబరంలో భాగమయ్యారు.
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేస్తూ ఆయన మాట్లాడుతూ –“తెలుగు సినిమా చరిత్రలో ‘శివ’ అనేది ఒక ఐకాన్ ఫిల్మ్. ఆ సినిమా భారతీయ సినిమాకు కొత్త దారిని చూపించింది. మాస్ రియలిజం, టెక్నికల్ బ్రిలియన్స్, ఎమోషనల్ ఇంపాక్ట్ అన్నీ కలగలిపిన ఒక అద్భుతం అది. ప్రతి తెలుగు సినిమా ప్రియుడి హృదయంలో ఈ సినిమా ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈసారి థియేటర్‌కి వెళ్తూ రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి… ఎందుకంటే ‘శివ’ని మళ్లీ పెద్ద తెరపై చూడటం ఒక ఫెస్టివల్‌లాంటిది,” అని తనదైన మాసీ హ్యూమర్ స్టైల్లో చెప్పారు. బన్నీ చెప్పిన ఈ ఫన్నీ కానీ ఫ్యాన్‌ఫుల్ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఆయన వీడియోకు అక్కినేని అభిమానులు మాత్రమే కాకుండా, సాధారణ సినీ ప్రేమికులందరూ ఫిదా అవుతున్నారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం, నాగార్జున స్టైల్, ఇళయరాజా సంగీతం – ఈ మూడు మళ్లీ థియేటర్ వాతావరణంలో వినిపించబోతున్నాయంటే తెలుగు సినీ ప్రపంచం మరోసారి 80ల కాలానికి వెనక్కి వెళ్తుందనడంలో అతిశయోక్తి లేదు.‘శివ’ రీ-రిలీజ్ కౌంట్‌డౌన్ మొదలైంది… ఇక బన్నీ వీడియో ఆ ఎగ్జైట్మెంట్‌కి మరింత ఊపునిచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి