టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రాబోయే సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ కాంబో అనౌన్స్ అయిన నాటి నుంచి అభిమానుల్లో అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై మరికొన్ని ఆసక్తికర వార్తలు బయటకొచ్చాయి. సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా, అల్లు అర్జున్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటి వరకు బన్నీ చేసిన అన్ని సినిమాల కంటే భిన్నంగా, అట్లీ మార్క్ మాస్ యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ల మేళవింపుతో ఈ కథను రూపొందించినట్టు సమాచారం.


సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే పవర్‌ఫుల్ స్టోరీగా ఉండబోతోందని, అల్లు అర్జున్ ఒక డాన్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమా హైలైట్‌గా నిలవబోతోందని, అందులో బన్నీ లుక్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయని తెలుస్తోంది. దీపికా పడుకోణే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆమె పాత్ర కూడా సరికొత్తగా, బన్నీకి తగిన స్థాయిలో డిజైన్ చేయబడిందని చెబుతున్నారు.


ఇక అట్లీ ఈ సినిమాలో ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్‌ను కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కొందరు టాప్ స్టార్స్ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. మ్యూజిక్ విషయంలో అట్లీ, థమన్ లేదా ఏఆర్ రెహ్మాన్ లలో ఒకరిని ఫైనలైజ్ చేయనున్నట్లు సమాచారం. మొత్తం మీద అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించబోతోందని ఇండస్ట్రీ టాక్. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అధికారికంగా లాంచ్ అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: