ఇలా సినిమాలలో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది శ్రీలీల. తాజాగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన కాబోయే భర్తకు ఉండవలసిన లక్షణాల గురించి కొన్ని విషయాలను బయటపెట్టింది. తనకు కాబోయే వారు అందంగా లేకపోయినా పర్వాలేదు కానీ, తనని బాగా అర్థం చేసుకోవాలని తన కెరీర్ కు అతను సపోర్ట్ చేయాలని, ఎక్కువ కేరింగ్గా చూసుకోవాలంటూ తెలిపింది. అలాగే తనతో జోవియల్ గానే ఉండాలని అన్నిటికంటే ముఖ్యంగా నిజాయితీగా ఉండాలని తెలియజేసింది శ్రీ లీల.
అలాంటి వ్యక్తి ఎదురైనప్పుడు కచ్చితంగా తాను పెళ్లి చేసుకుంటానంటూ క్లారిటీగా చెప్పేసింది. అలాగే తాను ఎక్కువగా తెలుగు చిత్రాల కనిపించకపోవడం పైన మాట్లాడుతూ కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాకుండా తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రల కోసమే తాను ఎదురు చూస్తున్నారని కచ్చితంగా అలాంటి పాత్ర ఎదురైతే ఎలాంటి చిత్రంలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉన్నానంటూ తెలిపింది. అయితే ఈ మధ్య అలాంటి పాత్రలు తనకు ఎదురు కాకపోవడంతో కొంత గ్యాప్ ఇచ్చినట్లుగా తెలియజేసింది శ్రీలీల. ప్రస్తుతం శ్రీ లీల చేసిన ఈ కామెంట్స్ విని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. శ్రీ లీల ప్రేమలో ఉందని అందుకే ఇలా పెళ్లి గురించి కోరికను బయటపెట్టింద ని కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి