ఇంతగా పాపులారిటీ సంపాదించిన రష్మికకు దేశమంతా అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు అందరికీ ఆసక్తికరమైన ప్రశ్న ఒక్కటే—“రష్మిక ఫేవరెట్ హీరో ఎవరు?”గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో ఈ ప్రశ్న ఆమెను పలుమార్లు అడిగినా, రష్మిక మాత్రం చాలా చాకచక్యంగా తప్పించుకుంది. “నాకు అందరి నటన ఇష్టమే. అందరిలోంచి కొన్ని స్కిల్స్ నేర్చుకున్నాను. అందుకే ఈ స్థాయికి ఎదిగాను,” అంటూ డిప్లొమాటిక్‌గా సమాధానం ఇచ్చేది.అయితే తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, రష్మికకు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే అపారమైన ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగిందట. అంతేకాదు, రజనీకాంత్ ఫోటోలు ఆమె బెడ్‌రూమ్‌లో మొత్తం అలంకరించి ఉంచిందని కూడా ఫ్రెండ్స్ చెప్పిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనమా థియేటర్‌లో రిలీజ్ అయితే తప్పక చూసేదట, కానీ ఇప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్‌గా మారిన తర్వాత బయటకు రావడం కాస్త కష్టమవుతోందట.
అలాగే రష్మిక హీరోయిన్‌గా ఎదగడానికి ప్రేరణ ఇచ్చిన నటీమణుల్లో ఒకరు సౌందర్య అని చెబుతోంది. సౌందర్య సినిమాలు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం తనకు మోడల్‌గా ఉన్నాయని రష్మిక అప్పట్లో బయటపెట్టింది. ప్రస్తుతం రష్మికకు సంబంధించిన మరో హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె నటించిన తాజా సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”—రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 7 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో ఊపిరి పీల్చనీయకుండా హీట్ క్రియేట్ చేసింది. ట్రైలర్‌లో రష్మిక పెర్ఫార్మెన్స్, ఎమోషన్, లుక్స్ అన్నీ ఫ్యాన్స్‌ను మంత్ర ముగ్ధులను చేశాయి.
ఈ సినిమాకు “కర్త, కర్మ, క్రియ—అని” రష్మిక అంటున్నారు. ఆమె మీదున్న అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ప్రస్తుతం రష్మిక మందన్నా సౌత్‌లో మాత్రమే కాదు, బాలీవుడ్‌లో కూడా స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఆమె ప్రతి సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్‌కు పండుగే. నిజంగా చెప్పాలంటే—ఇప్పటి సినీ ప్రపంచంలో రష్మిక మందన్నా అనే పేరు ఒక మాంత్రికం లాంటిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి