టాలీవుడ్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం మాస్ జాతర. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఎన్నో చిత్రాలకు తెలుగులో రచయితగా పనిచేసిన భాను బోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత నాగ వంశీ, సాయి సౌజన్య బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలె చిత్ర బృందం యాక్టివ్ గా ఉంటూ ట్రైలర్ ని కూడా విడుదల చేసింది. ట్రైలర్ తో ఖుషి అయిన అభిమానులకు సినిమా ఖచ్చితంగా ఫుల్ మీల్స్ పక్కా అంటూ ఫ్యాన్స్ తెలియజేస్తున్నారు.

ట్రైలర్ విషయానికి వస్తే ఇందులో రవితేజ రైల్వే పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. తన పాత్రలో మాత్రం ఒదిగిపోయి మరి నటించారు. అలాగే కామెడీ సన్నివేశాలు కూడా మరింత ఉత్సాహం ఇచ్చేలా కనిపిస్తున్నాయి. శ్రీలీల కూడా తన అందంతో మరింత అట్రాక్షన్ గా కనిపిస్తోంది. మొదటిసారి శ్రీకాకుళం యాసలో మాట్లాడి అదరగొట్టేసింది.రవితేజ, శ్రీ లీల మధ్య కెమిస్ట్రీ కూడా హైలెట్ గా ఉంది.అదిరిపోయే పంచ్ డైలాగులతో రవితేజ మాస్ జాతర ట్రైలర్ అభిమానులు కోరుకునేలా ఉన్నది. విలన్ గా నవీన్ చంద్ర నటించారు. నవీన్ చంద్ర, రవితేజ మధ్య ఉత్కంఠభరతమైన సీన్స్ ట్రైలర్లో హైలెట్ గా ఉన్నాయి. బీమ్స్ సిసిరోలియో అందించినటువంటి సంగీతం కూడా ట్రైలర్ కు మరింత అట్రాక్షన్ అయ్యేలా చేస్తోంది. మరిసినిమా అభిమానులను ఏ విధంగా ఆకట్టుకుందనే విషయం తెలియాలి అంటే అక్టోబర్ 31వ వరకు ఆగాల్సిందే.


వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడింది. అలాగే అదే రోజున బాహుబలి రీ రిలీజ్  కాబోతోంది. దీంతో రవితేజ మాస్ జాతర సినిమా పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వినిపించినప్పటికీ నిన్నటి రోజున ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: