ఈ చిత్రంలో హీరోయిన్‌గా రాశి ఖన్నాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మలయాళీ బ్యూటీ మాళవిక మోహన్ కూడా మరో హీరోయిన్‌గా ఎంపికయ్యారట. ఈ జంట కాంబినేషన్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమాలో అసలు సెన్సేషన్ ఏమిటంటే — బాలీవుడ్ నటుడు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో ప్రధాన నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడనే వార్త. ‘మహారాజా’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మెగా 158వ సినిమా అవ్వడం విశేషం. చిరంజీవి – అనురాగ్ కశ్యప్ మధ్య సీన్ కాంపిటేషన్, డైలాగ్ వర్షం, ఫైట్ సీక్వెన్సెస్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఊహించుకోవడం కష్టమే. బాబీ సినిమాల్లో ఫైట్స్ ఎప్పుడూ మాస్ ఆడియన్స్‌ను థ్రిల్ చేయగలవు. అలాంటి ఫైట్లలో చిరంజీవి ఎంట్రీ, అనురాగ్ కశ్యప్ విలన్ ప్రెజెన్స్ కలిసి మాస్ జాతరగా మారే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం.
చిరంజీవి సినిమాల్లో విలన్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో గతంలోనే ప్రూవ్ అయింది. ఇప్పుడు ఆ స్థాయిలోనే కాకుండా మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేయగల క్యారెక్టర్‌ను బాబీ ప్రత్యేకంగా రాశాడని టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద, మెగాస్టార్ చిరంజీవి – బాబీ – అనురాగ్ కశ్యప్ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా హై వోల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలవడం ఖాయం అన్న నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. చూడాలి మరి, ఈ సూపర్ కాంబినేషన్‌తో బాబీ మెగాస్టార్ కెరీర్‌లో మరో మైలురాయిని సృష్టిస్తాడా, లేక ఫ్యాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ సర్ప్రైజ్ ఇస్తాడా!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి