టాలీవుడ్‌లో యంగ్ సెన్సేషన్‌గా ఎదిగిన నటి శ్రీలీల కొద్ది కాలంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఇటీవల ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. దీంతో శ్రీలీల అంటేనే ఐరెన్‌లెగ్ అన్న ముద్ర పడిపోయింది. “ ఆదికేశవ ” , “ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్ ”, “ గుంటూరు కారం ” వంటి సినిమాలు పెద్దగా రాణించకపోవడంతో ఆమెపై సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా ఆమె యాక్టింగ్ కంటే డ్యాన్స్ స్టైల్స్ మీద ఎక్కువగా మీమ్స్, సెటైర్లు వరుసగా పడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలీలకు ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ అవసరం అయ్యింది. ఆమె కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి రావాలంటే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వాల్సిందే అనే పరిస్థితి. ఈ నేపథ్యంలో శ్రీలీల నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ మాస్ జాతర ” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ “ ధమాకా ” లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ వల్లే ఈ కొత్త కాంబోపై కూడా మంచి బజ్ ఏర్పడింది.
“ మాస్ జాతర ” లో శ్రీలీల పూర్తిగా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందట. శ్రీకాకుళం యాసలో మాట్లాడే ఈ పాత్రలో ఆమె కొత్తగా కనిపించబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌లో ఆమె లుక్ బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు. రవితేజ ఎనర్జీ, మాస్ ఎలిమెంట్స్, థమన్ మ్యూజిక్ కలయికగా ఈ సినిమా పక్కా ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పుడు అందరి దృష్టి శ్రీలీలపైనే ఉంది. “ మాస్ జాతర ” తో ఆమెకు మళ్లీ హిట్ ఫామ్ దక్కుతుందా, లేక ఇంతవరకూ ఉన్న లక్ కొనసాగుతుందా అన్నది చూడాలి. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా శ్రీలీల కెరీర్‌లో మళ్లీ ఒక పెద్ద మలుపుగా మారే అవకాశం ఉంది. ఇక ఫలితం తెలుసుకోవాలంటే మాస్ జాతర విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి