ఇటీవల శృతి హాసన్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, విశ్వాసాలు, ఆచారాలు, సంస్కృతుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. శృతి మాట్లాడుతూ –“సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ రోజున పూజలు చేయడం, దేవుడి పటాల ముందు కొబ్బరికాయ కొట్టడం, శుభారంభం కోసం ప్రత్యేక హోమాలు చేయడం వంటివి నేను తొలిసారిగా చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. షాక్ అయ్యాను కూడా! ఎందుకంటే మా ఇంట్లో అలాంటి పూజలు చేసే అలవాటు లేదు. మా నాన్న కమల్ హాసన్ గారు దేవుళ్లను ఎక్కువగా నమ్మరు. ఆయన ఎప్పుడూ తన సిద్ధాంతాలకు కట్టుబడి, శాస్త్రీయ దృష్టికోణంతో ముందుకు సాగుతారు.”
“మా ఇంట్లో ఆచారాలు, పూజలు, పెద్దగా ఉండేవి కావు. కానీ క్రమశిక్షణ మాత్రం ఎప్పుడూ ఉండేది. మా నాన్న చాలా డిసిప్లిన్ ఉన్న వ్యక్తి. ఆయన జీవితం నాకు గొప్ప ప్రేరణ. కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక నేను చూసింది చాలా భిన్నమైన ప్రపంచం. ఇక్కడ ఉన్న నటీనటులు, టెక్నీషియన్లు, దర్శకులు ఎంత బిజీగా ఉన్నా, ఎంత మోడర్న్‌గా ఉన్నా కూడా తమ సంస్కృతిని, సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారు. సినిమా ప్రారంభోత్సవానికి ముందు దేవుడిని ప్రార్థించడం, కొబ్బరికాయ కొట్టడం వంటి ఆచారాలను ఎంతో భక్తితో చేస్తారు. మొదట్లో నాకు ఇది వింతగా అనిపించినా, తర్వాత ఈ ఆచారాల వెనక ఉన్న భావన, మనసులోని విశ్వాసం తెలుసుకుని గౌరవించడం మొదలుపెట్టాను.”
“ ఇండస్ట్రీలో చాలా మంది సౌత్ స్టార్లు డబ్బు సంపాదించిన తర్వాత కూడా తమ పాత విలువలను, పద్ధతులను మరిచిపోకుండా గౌరవిస్తారు. కొంతమంది తాము ఎంత పెద్ద స్టార్ అయినా కూడా సాధారణ జీవితం గడపడం ఇష్టపడతారు. ఆడంబరాలకు దూరంగా ఉంటూ విలువలకు ప్రాధాన్యత ఇస్తారు. వారిని చూస్తే నిజంగా చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. కమర్షియల్ గ్లామర్ కంటే ఇలాంటి విలువలు ఎక్కువగా నిలిచిపోతాయి అని ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుసింది.”శృతి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అభిమానులు ఆమె ఓపెన్ మైండెడ్‌నెస్‌కి, ఆలోచనా విధానానికి ఫిదా అవుతున్నారు. చాలామంది నెటిజన్లు “శృతి హాసన్ చాలా నిజాయితీగా మాట్లాడింది”, “కమల్ హాసన్ లాంటి తండ్రి కూతురే కదా, ఆలోచనలు కూడా అంతే విభిన్నంగా ఉంటాయి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి