తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాస్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన అనేక సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు.

చాలా సంవత్సరాల పాటు కెరియర్ను మంచి స్థాయిలో ముందుకు సాగించిన రామ్ ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పెట్టి భారీ అపజయలను అందుకుంటూ వస్తున్నాడు. ఈయన వరుసగా ది వారియర్ , స్కంద , డబల్ ఇస్మార్ట్ సినిమాలతో వరుస పెట్టి భారీ అపజయాలను సొంతం చేసుకున్నాడు. ఇలా వరుస ప్లాప్ లతో సత మతం అవుతున్న రామ్ ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఆంధ్ర కేక్ తాలూకా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం నవంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను చాలా సైలెంట్ గా నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన మరో పాట విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి "చిన్ని గుండెలో" అనే సాంగ్ను అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: