సినిమా ఇండస్ట్రీ లో ఈ మధ్య కాలంలో రైటర్స్ సంఖ్య చాలా తక్కువ అయిపోయింది. గతంలో ప్రతి దర్శకుడి దగ్గర చాలా మంది రైటర్స్ ఉండేవారు. దానితో దర్శకులు కూడా రైటర్స్ కి కథ తయారు చేసే బాధ్యతను అప్పచెప్పేవారు. కథ మొత్తం తయారు అయ్యాక అది దర్శకుడికి నచ్చినట్లయితే ఏదో ఒక హీరోతో సినిమా చేసేవాడు. దానితో సంవత్సరానికి ఒక్క దర్శకుడు చాలా సినిమాలను రూపొందించేవాడు. ఈ మధ్య కాలంలో కథ రచయితలు ఎక్కువ శాతం దర్శకులుగా మారుతున్నారు.

దానితో ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కథ రచయితల కొరత పెద్ద ఎత్తున ఏర్పడింది. ఇది ఇలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన కథ రచయితలలో ప్రసన్న కుమార్ బెజవాడ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకు కథ రచయితగా పని చేశాడు. ఈయన కథ అందించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ కథ రచయిత తయారు చేసిన ఓ కథకు అద్భుతమైన డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రసన్న కుమార్ తాజాగా ఓ స్టోరీ ని తయారుచేసినట్లు, దానిని రవితేజ మరియు నవీన్ పోలిశెట్టి లకు వినిపించినట్లు , ఈ ఇద్దరికి కూడా ఆ సినిమా కథ అద్భుతంగా నచ్చినట్లు , దానితో ఈ ఇద్దరు కూడా ప్రసన్న కుమార్ తాజాగా తయారు చేసిన ఆ స్టోరీ లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రసన్న కుమార్ కొంత కాలం క్రితం సందీప్ కిషోర్ హీరో గా రీతూ వర్మ హీరోయిన్ గా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన మజాకా అనే మూవీ కి కథను అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: