శేఖర్ కమ్ముల — ఈ పేరు వినగానే తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌, హృదయాలను తాకే లవ్ స్టోరీస్‌, సున్నితమైన భావోద్వేగాల మేళవింపుతో కూడిన సినిమాలు… ఇవన్నీ ఆయన సంతకం లాంటి అంశాలు.  శేఖర్ కమ్ముల.. ఆనంద్‌, గోదావరి, హ్యాపీ డేస్‌, ఫిదా, లవ్,కుబేర స్టోరీ వంటి సినిమాలతో తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన సినిమాల్లో పాత్రలు ఎంత రియలిస్టిక్‌గా ఉంటాయో, భావోద్వేగాలు కూడా అంత నిజాయితీగా, సహజంగా కనిపిస్తాయి. అందుకే ఆయన ప్రతి చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇటీవల శేఖర్ కమ్ముల ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందించిన ‘కుబేర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి ఆయన శైలిలోని ఆ మృదుత్వం, లోతైన భావన, సామాజిక సందేశం అన్నీ కలగలసి ఉండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్‌ వేరే స్థాయిలో ఉంటుంది. ఓటీటీల్లో ఇప్పటికీ ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా లాంటి చిత్రాలు తరచూ ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఆయన రూపొందించే ప్రతి సినిమా ఒక సెన్సిటివ్ సామాజిక అంశాన్ని తాకుతుంది, ఆ అంశాన్ని ప్రేమ, కుటుంబ విలువలు, మానవీయతతో మిళితం చేసి చూపించగల సత్తా శేఖర్ కమ్ములకే ఉంది. అందుకే ఆయనను "క్లాస్‌ & మాస్‌ మైండ్‌ల మేళవింపు" అని అభిమానులు అంటారు.


ఇక శేఖర్ కమ్ముల వ్యక్తిగత జీవితంపై వస్తే — ఆయన ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం చాలా అరుదు. సినిమా ఫంక్షన్లు, అవార్డ్ ఈవెంట్లు తప్పితే ఆయన బహిరంగంగా చాలా తక్కువగా కనిపిస్తారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండరు. అందుకే ఆయన కుటుంబం, వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా ఎవరికి తెలియదు.అయితే ఇటీవల ఆయన కుమార్తె వందనా కమ్ముల ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కుబేర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వందనా తన హాజరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఈవెంట్‌లో ఆమె ఉత్సాహంగా కనిపించింది. ఇక తాజాగా ఆమె తన జన్మదినాన్ని (బర్త్‌డే) ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.



వందన ఫోటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. “శేఖర్ కమ్ముల‌కి ఇంత పెద్ద కూతురు ఉందా?”, “హీరోయిన్స్‌కీ సాటిగా ఉంది”, “నాన్నలా క్లాస్‌గా, అందంగా ఉంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అభిమానులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ “తండ్రి లాగే ఫ్యూచర్‌లో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తే అదిరిపోతుంది” అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఇలా శేఖర్ కమ్ముల సినిమాలు ఒక వైపు ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంటే, మరోవైపు ఆయన కుటుంబం కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆయన వంటి దర్శకులు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంత వరకు మనకు మంచి కంటెంట్‌, నిజమైన భావోద్వేగాలు కలిగిన సినిమాలు ఎప్పటికీ అందుతూనే ఉంటాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: