మొత్తానికి చాలా రోజులుగా లోపల లోపల మంటలు రగులుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు పూర్తిగా బయటకు వచ్చేసింది. ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి, యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య ఏదో విభేదాలు ఉన్నాయనే వార్తలు గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు ఆ వార్తలు కేవలం రూమర్స్ కాదని తేలిపోయింది. ఇద్దరి మధ్య నిజంగా పెద్ద స్థాయిలో గొడవ జరిగిందని స్పష్టమైంది.సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు ప్రధాన చర్చా విషయంగా మారింది. నిర్మాతల మండలిలోకి కూడా ఈ విషయం వెళ్లి, ఇరువురి నుండి వచ్చిన లిఖితపూర్వక ఉత్తరాలు, వివరణలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు రావడంతో టాలీవుడ్ మొత్తంలో సంచలనం రేగింది.


మొదటగా నిర్మాత నిరంజన్ రెడ్డి తానే ముందుకు వచ్చి మొత్తం వ్యవహారాన్ని పబ్లిక్‌గా బయటపెట్టారు. తాను ఇప్పటివరకు ప్రశాంత్ వర్మకు ఇచ్చిన మొత్తం, ఎప్పుడు, ఏ ప్రాజెక్ట్ కోసం, ఏ విధంగా చెల్లించానన్న విషయాలను అంచెలంచెలుగా వివరించారు. ఆయన చెప్పిన ప్రకారం — మొత్తం మీద 20 కోట్లకు పైగా తాను చెల్లించానని, కానీ ప్రతిఫలం రాలేదని తెలిపారు.ఇంతకే ఆగకుండా, తనతో చేయాలని అంగీకరించి తరువాత వేరే సంస్థలకు వెళ్లిపోయిన మహాకాళి, జై హనుమాన్, అధీరా వంటి ప్రాజెక్టుల విషయంలో కూడా పెద్ద ఆరోపణలు చేశారు. ఆ సినిమాలకు సంబంధించి తానూ భాగస్వామినని, కనీసం 200 కోట్ల వరకు రాయల్టీ రూపంలో చెల్లింపులు జరగాల్సి ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సినిమాల నిర్మాణ సంస్థలు ముందుకు వెళ్లకూడదని, లీగల్ హెచ్చరిక కూడా ఇచ్చినట్లు సమాచారం.



ఈ ఆరోపణలకు ప్రశాంత్ వర్మ కూడా గట్టిగానే బదులిచ్చారు. పేజీలకొద్దీ సమాధానాలు ఇస్తూ, ప్రతి ఆరోపణకు స్టెప్ బై స్టెప్ వివరణ ఇచ్చారు. తన వాదన ప్రకారం — నిరంజన్ రెడ్డి వల్లే తాను కెరీర్ పరంగా నష్టపోయానని, చాలా అవకాశాలు కోల్పోయానని పేర్కొన్నారు. అంతేకాదు, తానే నష్టపోయిన వ్యక్తినని, తాను ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, పైగా తనకే నష్టపరిహారం ఇవ్వాలని కూడా ప్రశాంత్ వర్మ డిమాండ్ చేశారు.ఇప్పుడు ఈ వివాదం ఏ దిశగా మలుపు తిరుగుతుందో చూడాలి. ఇరువురు తమ తమ ఆధారాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నారని సమాచారం. ఇప్పటికే నిర్మాతల మండలి మధ్యవర్తిత్వం చేపట్టిందని, కానీ సమస్య ఇంకా పరిష్కార దశకు రాలేదని తెలిసింది. ఈ సీన్ ఎప్పుడు క్లీన్ అవుతుందో, ఎవరి పక్షం నిజమో అనేది ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఇప్పుడు ఆయన కమిట్ అయిన సినిమాల పరిస్ధితి ఏంటి..? జై హనుమాన్ , మహాకాళి ,అధీరా విషయంలో ఆయన స్టెప్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది..?

మరింత సమాచారం తెలుసుకోండి: