ఈ వారం దివ్వెల మాధురి ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి అడుగుపెట్టిన మాధురి, మొదటి రోజే తన అట్టిట్యూడ్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఆమె మాట తీరు, నడవడి హౌస్‌లో ఒక కొత్త ఎనర్జీని తీసుకొచ్చాయి. "నన్ను ఎవరు గుర్తించరా?" అని చెప్పడం తోనే హౌస్‌లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా శ్రీజపై ఫైర్ అవడం, టాస్క్‌లలో దూకుడు చూపించడం, తన అభిప్రాయాలను ఎప్పుడూ తెగవిడిగా చెప్పడం వల్ల ఆమెను ఫైర్ బ్రాండ్ అని పిలిచే స్థాయికి వచ్చింది.
తర్వాతి రోజుల్లో తనూజ – కళ్యాణ్ ఫ్రెండ్‌షిప్‌పై, అలాగే రీతూ – పవన్ బాండింగ్‌పై చేసిన కామెంట్స్ హౌస్‌లో కొత్త వివాదాలకు దారితీశాయి. నాగార్జున గారు కూడా వీకెండ్ ఎపిసోడ్‌లో మాధురి ప్రవర్తనపై స్పెషల్‌గా స్పందించారు. “నీ స్టైల్‌లో కాన్ఫిడెన్స్ ఉంది కానీ, ఆ కాన్ఫిడెన్స్‌కి కంట్రోల్ కూడా ఉండాలి” అని చెప్పి హెచ్చరించారు.తర్వాతి వారాల్లో మాధురి తన తీరును కొంత మెత్తబరచి, కంటెస్టెంట్లతో కలిసిపోతూ, టాస్క్‌లలో తన శక్తిమేరకు ఫైట్ చేసింది. ఆ పాజిటివ్ మార్పుతో ఆమెకు అభిమానులు కూడా పెరిగారు. సోషల్ మీడియాలో “మాధురి ఇంప్రూవ్ అవుతోంది”, “ఆమెకు మరో ఛాన్స్ ఇవ్వాలి” అని కామెంట్లు కూడా వచ్చాయి. కానీ షో రూల్స్ ప్రకారం ఓటింగ్ ఫలితాలు నిర్ణయాత్మకమవుతాయి కాబట్టి, ఈ వారం ఆమె ఎలిమినేషన్ షాక్ ఇచ్చినట్లే అయింది.
ఇప్పటికే హౌస్‌లో మాధురి లేకపోవడం కంటెస్టెంట్లకు గ్యాప్‌లా అనిపిస్తోందని లోపలి సన్నివేశాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రేక్షకులు మాత్రం "ఇది నిజమేనా?", "లేకపోతే సీక్రేట్ రూమ్ లో పెడతారా?" అంటూ ఎదురు చూస్తున్నారు.మాధురి ఎలిమినేషన్ వార్తపై అధికారిక ప్రకటన వచ్చేసింది. కానీ జనాలకి మాత్రం ఏదో డౌట్. హౌస్ లో మాధురి లేకపోతే ఆ సందడి..ఆ కాంట్రవర్సీ ఉండదు..రేటింగ్స్ కూడా తగ్గిపోతాయ్. మరి అలాంటి మాధురిని వదులుకుంటుందా బిగ్ బాస్..? సీక్రేట్ రూమ్ లాంటిది ప్లాన్ చేసే ఉంటుంది అని అంటున్నారు. కొంతమంది ఎలిమినేషన్ లేదు బొక్క లేదు..చూడు మళ్ళీ మాధురి ఈజ్ బ్యాక్ అంటారు అంటున్నారు. చూడాలి మరి దీని పై బిగ్ బాస్ టీం ఎలా రియాక్ట్ అవుతుందో..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి