ఇన్నాళ్లకి ఆ ఖాళీని నింపేస్తూ, ఇలియానా ప్లేస్‌ను రీప్లేస్ చేస్తోంది అనిపించే ఓ బ్యూటీ సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది.ఆమె మరెవరో కాదు—భాగ్యశ్రీ బోర్సే. చాలా సైలెంట్‌గా, ఎలాంటి హంగామా లేకుండా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు సంపాదించుకుంటోంది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలు సాధించకపోయినా… ఆమె అందం మాత్రం కుర్రాళ్లకు నిజంగానే నిద్రపట్టనంత మత్తు తెప్పిస్తోంది.సోషల్ మీడియాలో ఆమె ఫోటోలకు కుర్రాళ్లు పడేసే కామెంట్స్ చూసినా ఎవరికైనా ఊపిరి ఆడకుండా చేస్తాయి. ఒక్కో ఫోటో కింద పడే రియాక్షన్స్ చూస్తే… “మరో ఇలియానా వచ్చేసింది!” అనేది ఫ్యాన్స్ అందరి టాక్.
ఇండస్ట్రీలో కూడా పలువురు ఇదే మాట చెబుతున్నారు—“ఇలియానాకు తరువాత అలాంటి బెల్లీ బ్యూటీ ఇక రాదు అనుకున్నాం… కానీ చివరకు ఆ స్థాయిలో కుర్రాళ్ల హృదయాలను దోచేస్తున్న బ్యూటీ దొరికింది. అదే మా భాగ్యశ్రీ బోర్సే” అంటూ రిపోర్ట్స్ రచ్చ చేస్తున్నాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు, రీల్స్, పోస్టులు—అన్ని ట్రెండ్ అవుతూ హాట్ టాపిక్‌గా మారిపోయాయి. అన్ని కలిసి వస్తే నెక్స్ట్ ఇండస్ట్రీని ఏలబోయేది ఈ బ్యూటీనే అనడంలో సందేహం లేదు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి