పైరసీ ఎంత పెద్ద భూతం లాంటిదో చెప్పనక్కర్లేదు. నిర్మాతలను ముప్పు తిప్పలు పెట్టిన ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సినీ ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సిపి సజ్జనార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మాడి రవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి, నాగార్జున వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో పైరసీ గురించి సినీ ప్రముఖులు ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం.

 పైరసీ పై చిరంజీవి స్పందన :
చాలా సంవత్సరాలుగా పైరసీ నుండి బయటపడాలి అనుకుంటున్నాం. సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. అలాంటి ఈ పైరసీ భూతం వల్ల చాలామంది నిర్మాతలు నష్టపోయారు. దీని నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.ఫైనల్ గా సివి ఆనంద్,సిపి సజ్జనార్ సహకారంతో ఇది జరిగింది.ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్టు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా పైరసీ ఆగిపోవాలని కోరుకుంటున్నాను. ప్రజలు పైరసీని ఎంకరేజ్ చేయవద్దు.సినిమాని మీ సినిమాగా భావించి పైరసీని పక్కకు పెట్టండి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ బాధను అర్థం చేసుకున్నందుకు పోలీసులను అభినందిస్తున్నా అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.

నాగార్జున స్పందన:
ఇమ్మాడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని తెలియడంతోనే చెన్నై నుండి నా స్నేహితుడు కాల్ చేసి మంచి పని చేశారు. మేము చేయనిది మీరు చేశారు అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఐబొమ్మ సైట్ రన్ చేసే వారి దగ్గర 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల ఫుల్ డేటా ఉంది.ఇలా ఫ్రీగా వస్తుందని సినిమాలను పైరసీలో చూసి మీకు మీరే మోసపోకండి.ఫ్రీగా చూస్తున్నాం అంటే దాని వెనుక కచ్చితంగా ఏదో ఒక మోసం ఉందని తెలుసుకోండి. ఫ్రీగా వస్తుందని చెప్పి ట్రాప్ లో పడకండి.మిమ్మల్ని మీరే మోసం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పటికైనా పైరసీని పక్కన పెట్టండి అంటూ చెప్పుకొచ్చారు.

రాజమౌళి స్పందన:
సినిమాలో విలన్ చాలెంజ్ చేస్తే హీరో 2 నెలల తర్వాత కటకటాల వెనుక వేసినట్టు ఉంది ఇది సూపర్ సీన్.. నిజంగా పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉచితంగా ఏదీ రాదు.ముందు అది గ్రహించాలి. ఉచితంగా వస్తుందంటే దాని వెనుక ఏదో పెద్ద ప్రమాదమే ఉందని గ్రహించాలి. పైరసీ చేసేవాళ్లు సంఘ సేవ చేయడం లేదు. మీరందరూ సినిమాలే కదా ఫ్రీగా చూస్తాం అనుకుంటున్నారు. కానీ వాళ్లు మాత్రం పెద్దపెద్ద సర్వర్లు ఉపయోగించి పైరసీ చేస్తున్నారు. అలా పైరసీ చేసేవారికి మేం డబ్బులు ఇవ్వడం లేదు.ఆ డబ్బంతా ఎక్కడి నుండి వస్తుంది. అది మీ నుండే వస్తుంది. మీరు పైరసీ చూడడం వల్ల మీ వ్యక్తిగత డేటాను వాళ్ళు అమ్ముకోవడం వల్ల వారికి డబ్బు వస్తుంది. మీ ఫోన్ నెంబర్, ఇమెయిల్,ఆధార్ ఏ ఒక్కటి ఉన్నా సరే సైబర్ బారిన పడతారు. మీ డేటా మొత్తం క్రిమినల్స్ కి అమ్మేస్తున్నారు. అందుకే ఇప్పటికైనా పైరసీకి దూరంగా ఉండండి.

సురేష్ బాబు స్పందన:
పైరసీని అరికట్టడంలో తెలంగాణ పోలీసులు చేసిన కృషి మరువలేనిది. దీనివల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితులు మరింత మెరుగుపడతాయి. దయచేసి పైరసీ చూడకండి. పైరసీ చూస్తున్నారు అంటే కచ్చితంగా మీ డేటా వాళ్లకి అందించినట్టే. మీ డాటా తో వాళ్లు ఎన్నో క్రిమినల్ చర్యలకు పాల్పడతారు. జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: