తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. ప్రపంచంలో ఉన్న టెంపుల్స్ అన్నింటిలో తిరుమల తిరుపతి దేవస్థానాన్నే అన్ని మతాల ప్రజలు దర్శించుకుంటారు. కలియుగ దైవంగా ఆ తిరుమల శ్రీవారిని పిలుచుకుంటారు. అలా ప్రతిరోజు వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతుంది.ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం తిరుమల శ్రీవారిని సంవత్సరానికి కనీసం ఓ పదిసార్లు అయినా దర్శించుకుంటారు. ఈ విషయం పక్కన పెడితే..తిరుమల శ్రీవారి దేవస్థానంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా శ్రీవారి మాడవీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం, శ్రీవారి సన్నిధిలో రీల్స్,షాట్స్, వీడియోలు చిత్రీకరించడం వంటివి చేయకూడదు. కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఎన్నిసార్లు చెప్పినా వినకుండా రీల్స్ పిచ్చి తో రీల్స్,షాట్స్ చేస్తూ, వీడియోలు తీస్తూ చెప్పులు వేసుకుని వస్తూ తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర అసభ్యకర పాటలతో రీల్స్ చేస్తూ దేవుణ్ణి అవమాన పరుస్తూ ఉంటారు. 

ఈ విషయంలో ఎప్పటికప్పుడు హిందువులు, టిటిడి వాళ్లు వారికి వార్నింగ్ ఇస్తూనే ఉంటారు. అయితే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ యాంకర్ శివ జ్యోతి కూడా ఓ వివాదంలో ఇరుక్కుంది.తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచినట్టు మాట్లాడి హిందువులకు కోపం తెప్పించింది.అయితే తాజాగా శివజ్యోతి తన స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.ఇక అక్కడ వీడియోలు తీయకూడదు అనే నిబంధన ఉంది.అయినా కూడా శివజ్యోతి ఫ్రెండ్స్ వీడియోలు తీస్తూ ఉన్నారు.అలాగే తిరుమల శ్రీవారిని దర్శించుకునేటప్పుడు క్యూలైన్లలో  ప్రసాదం ఇచ్చిన సమయంలో మనం అన్నింటికంటే కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం. మనం రిచ్చెస్ట్ బిచ్చగాళ్ళం అంటూ తిరుమల శ్రీవారి  ప్రసాదాన్ని కించపరిచినట్లుగా మాట్లాడింది. 

ప్రసాదాన్ని అడుక్కోవడం ఏంటి..రిచ్చెస్ట్ బిచ్చగాళ్ళు అనడం ఏంటి..అసలు శివ జ్యోతి కి మైండ్ పనిచేస్తుందా..శ్రీవారి మహా ప్రసాదాన్ని అడుక్కోవడంతో పోలుస్తుందా.. అంటూ మండిపడుతున్నారు.అంతే కాదు తిరుమల శ్రీవారి మహాప్రసాదాన్ని అడుక్కు తినడం,రిచ్చెస్ట్ బిచ్చగాళ్ళం అని మాట్లాడిన మాటలకు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే అంటూ మండిపడుతున్నారు.మరి దీనిపై శివ జ్యోతి ఏ విధంగా స్పందిస్తుంది.. క్షమాపణలు చెబుతుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: