నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి షో నుంచి సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కూడా అంచనాలను మించి మరి కలెక్షన్స్ రాబడుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీ ఇప్పటివరకు రూ.15 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటిలో వస్తుందా అని ఓటిటి లవర్స్ చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి వారి కోసమే తాజాగా ఒక అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రిమింగ్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా థియేటర్లో విడుదలైన 50 రోజుల తర్వాత ఓటిటి స్ట్రీమింగ్ తీసుకురావాలనే డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అంటే జనవరి రెండో వారంలో ఈ సినిమా ఓటీటిలో స్ట్రిమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న సినిమాగా వచ్చి ప్రశంసలు అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి సినిమా టికెట్ ధర కూడా వంద రూపాయలు లోపు విడుదల చేయడంతో ఈ సినిమాకి భారీ క్రేజ్ ఏర్పడింది. సినిమా సక్సెస్ ఈవెంట్ కూడా హైలెట్ గా నిలిచింది.మరి ఓటీటిలో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి