తెలుగు ప్రేక్షకుల్లో సూపర్‌య‌హీరో సినిమాలకు భారీ అభిమాన బేస్ ఉంది. DC , మార్వెల్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతాయి. క్రిస్టోఫర్ నోలన్ డార్క్ నైట్ ట్రయాలజీ తో DC ఘనవిజయం సాధించగా, వండర్ వుమన్, ఆక్వామ్యాన్  సీక్వెల్స్ ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు. మరోవైపు, మార్వెల్ ఎవెంజర్స్ , డెడ్‌పూల్ చిత్రాలు బాక్స్ ఆఫీస్‌ను శాసించాయి, DC కంటే ముందంజలో నిలిచాయి. ఈ నేపథ్యంలో, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ఫేమ్ జేమ్స్ గన్ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌మ్యాన్ (2025) తెలుగు ప్రేక్షకులకు ఎలా ఉంది ?


 కథాంశం : క్లార్క్ కెంట్/సూపర్‌మ్యాన్ (డేవిడ్ కోరెన్‌స్వెట్) బోరావియా, జహ్రాన్‌పూర్ దేశాల మధ్య యుద్ధంలో చిక్కుకుంటాడు. లెక్స్ లూథర్ (నికోలస్ హౌల్ట్) తన టెక్నాలజీతో "హామర్" రోబోట్‌ను సృష్టించి, సూపర్‌మ్యాన్‌ను ఓడిస్తాడు. సోషల్ మీడియా ద్వారా సూపర్‌మ్యాన్‌ను దేశద్రోహిగా చిత్రీకరిస్తూ, లూథర్ యుద్ధాన్ని రెచ్చగొడతాడు. లోయిస్ లేన్ (రాచెల్ బ్రోస్‌నహన్), సూపర్ డాగ్ క్రిప్టో సాయంతో సూపర్‌మ్యాన్ తన నిజాయతీని నిరూపిస్తాడు.


 విశ్లేషణ : జేమ్స్ గన్ తన మార్వెల్ శైలిని DCలో చూపించే ప్ర‌య‌త్నం - రంగురంగుల VFX , కామిడి, వేగవంతమైన యాక్షన్. 130 నిమిషాల రన్‌టైమ్ తెలుగు యువతకు ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా క్యాంపెయిన్ *ఇండియన్ 2*లోని "గో బ్యాక్" థీమ్‌ను గుర్తు చేస్తుంది, "గో బ్యాక్ సూపర్‌మ్యాన్" నుంచి "వీ వాంట్ సూపర్‌మ్యాన్"గా మారే కథ ప్ర‌స్తుతం ఉన్న సోష‌ల్ మిడియ‌ సమస్యలతో కనెక్ట్ అవుతుంది. అయితే, కథలో లోతు, ఎమోషనల్ కనెక్షన్ స‌రిగా లేకపోవడం నిరాశ కలిగించింది. గ్రీన్ లాంటర్న్, హాక్‌గర్ల్ పాత్రలకు ప్రాముఖ్యత లేకపోవడం, లూథర్ యొక్క ప్లాన్‌లో లాజిక్ లోపాలు (సీక్రెట్ ఛాంబర్ ఓపెనింగ్, ఫోటో ద్వారా విలన్ గుర్తింపు) సినిమాను సాధారణంగా చేశాయి.


నటన & సాంకేతికత : "డేవిడ్ కోరెన్‌స్వెట్ ఆకర్షణీయంగా సూపర్‌మ్యాన్ పాత్రలో మెరిశారు. రాచెల్ బ్రోస్‌నహన్ చురుకైన లోయిస్ లేన్‌గా ఆకట్టుకోగా, నికోలస్ హౌల్ట్ పవర్‌ఫుల్ విలన్ లెక్స్ లూథర్‌గా ఆకట్టుకున్నాడు. క్రిప్టో డాగ్ తన చిలిపి చేష్టలతో నవ్వులు పంచగా, యాక్షన్ సీన్లు గూస్‌బంప్స్ తెప్పించాయి. విజువల్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ హాలీవుడ్ స్టాండర్డ్‌లో ఉండి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి."


 తీర్పు : “సూపర్‌మ్యాన్ DCకి కొత్త ఊపు ఇచ్చింది … స్టైల్ ఉన్నాడు, స్పీడ్ ఉన్నాడు, సెంట్‌మెంట్ కూడా ఉంది ! కానీ మార్వెల్ సినిమాలలా ఎడ్జ్‌ ఆఫ్ ది సీట్ ఫీల్ మాత్రం తక్కువే. అయినా DC ఫ్యాన్స్, యూత్ 3Dలో తప్పకుండా ఓ రౌండ్ చూడవ‌చ్చు!”

రేటింగ్: 3 /5  
యాక్షన్ & క్రిప్టో కోసం చూడొచ్చు…
కథ కోసం అయితే ఆశించే వారికి ఇది న‌చ్చాదు..

మరింత సమాచారం తెలుసుకోండి: