అనుబంధాల ఆత్మీయ అనురాగాల మధ్య ఈరోజు అన్నా- చెల్లి  అక్కా తమ్ముళ్ళ మధ్య అనుబంధానికి ప్రతీకగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక ప్రముఖ దినపత్రికకు మహేష్ సోదరి మంజుల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సోదరులతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు తన అన్న రమేష్ అంటే ‘అండ’ అనీ తన తమ్ముడు మహేష్ అంటే ‘తోడు’ అనీ అంటూ వారిద్దరితో తనకు గల సాన్నిహిత్యం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వివరించింది మంజుల.
Image may contain: 2 people, people smiling, people sitting and indoor
చిన్నప్పుడు తన దగ్గర గారాబం చేస్తూ ఎప్పుడు ఐస్ క్రీమ్ లు కావాలి అంటూ తన చుట్టూ తిరిగిన మహేష్ ఇప్పుడు తనకు ‘అన్నగా’ మారిపోయి తనకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదగడంతో పాటు ఏవిషయాన్ని ఎలా డీల్ చేయాలి అని చెప్పే సందర్భంలో మహేష్ ను తాను చూసినప్పుడు మహేష్ తనకు తమ్ముడా లేక అన్నా అన్నసందేహం వస్తోంది అంటూ కామెంట్స్ చేసింది ఈసూపార్ స్టార్ కుమార్తె. ఇదే సందర్భంలో తన అన్నయ్య రమేశ్ గురించి మాట్లాడుతూ ఒకసారి తన అన్న అమెరికా వెళుతున్నప్పుడు తనకు 5 గౌన్లు తెచ్చి పెట్టమని అడిగితే 11 సూట్ కేసులు నిండా తనకు గౌన్లు పెర్ఫ్యూమ్స్ తెచ్చి ఇచ్చిన తన అన్న రమేశ్ ప్రేమ గురించి గుర్తుకు చేసుకుంటూ రమేశ్ మహేష్ లు లాంటి అన్నదమ్ములు ఉండటం తన అదృష్టం అని అంటోంది మంజుల. 

అంతేకాదు రమేశ్ మహేష్ ల మధ్య సాన్నిహిత్యం చాలందికి తెలియదనీ అయితే వీరిద్దరి మధ్య చాల ఏజ్ గ్యాప్ ఉన్నా తన అన్న రమేశ్ అంటే తమ్ముడు మహేష్ కు విపరీతమైన ప్రేమ అని అంటూ రమేశ్ కోసం మహేష్ ఏదైనా చేస్తాడు అంటూ ఆ అన్నదమ్ముల సాన్నిహిత్యం పై కామెంట్స్ చేసింది మజుల. తనకు తండ్రి తరువాత తండ్రి లాంటి వాడు తన అన్న రమేశ్ అయితే తన జీవితాంతం తోడు నిలిచే తమ్ముడు మహేష్ అంటూ వారిద్దరూ లేకుంటే తాను జీవితంలో చేసిన ప్రయోగాలకు నిలదోక్కుకోలేను అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. 
Mahesh Babu Sister Manjula From Actress To Director
మహేష్ మోడరన్ గా ఆలోచిస్తే తన అన్న రమేశ్ ట్రెడిషనల్ గా ఆలోచిస్తాడని అయితే వారిద్దరితో మనసు విప్పి మాట్లాడినప్పుడు తన బాధలు తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ పోరాడుతాను కిందపడినా గెలుస్తాను అన్న నమ్మకం తనకు ఏర్పడుతుందని కామెంట్స్ చేసింది సూపార్ స్టార్ సోదరి. తన విషయాలు ఏమీ దాచకుండా తన అన్నదమ్ములకు చెపుతాను అంటూ తాను చేసిన తప్పులకు తన అన్న రమేశ్ తమ్ముడు మహేష్ ల చేత తిట్టించు కోవడంలో ఉన్న అనుభూతి తనకు ప్రపంచలో మరెక్కడా లభించదు అంటూ తనను రమేశ్ మహేష్ లు అర్ధం చేసుకున్నట్లుగా ప్రపంచంలో మరెవ్వరూ అర్ధం చేసుకోరు అంటూ తమది అనురాగాల ఆత్మీయ బంధం అంటోంది మంజుల.. 



మరింత సమాచారం తెలుసుకోండి: