వరస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండకు ‘నోటా’ ఊహించని షాక్ ఇవ్వడంతో ఈనెల విడుదల కాబోతున్న ‘తాక్సీవాలా’ గురించి విజయ్ తెగ టెన్షన్ పడిపోతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఒక సెంటిమెంట్ విజయ్ దేవరకొండకు విపరీతమైన ధైర్యాన్ని కలిగిస్తోంది అని టాక్. 

సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లు కొందరు నటులు గెస్ట్ రోల్ లో కనిపించినా ఆ సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయి అన్న నమ్మకాలు ఇండస్ట్రీ వర్గాలలో విపరీతంగా ఉంది. ఇప్పుడు అలాంటి నమ్మకమే ‘టాక్సీవాలా’ కు కలిసి వచ్చేసెంటిమెంట్ గా మారుతుందని విజయ్ దేవరకొండ గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. 

మళయాళ బ్యూటీ మాళవిక నాయర్ ‘టాక్సీవాలా’ లో కీలకమైన పాత్ర పోషిస్తోంది. కథ మొత్తం ఆమె చుట్టూనే రివాల్వ్ అవుతుంది అని టాక్. ఇప్పటి వరకు మాళవిక చేసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కళ్యాణ వైభోగమే’, ‘మహానటి’  సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఆసినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర సక్సస్ అయ్యాయి. 

వాస్తవానికి ‘టాక్సీవాలా’ లో ఇద్దరు హీరోయిన్లు వున్నారు. రెండో హీరోయిన్, జస్ట్ గ్లామర్ యాడింగ్ మాత్రమే అని అంటున్నారు. అయితే మాళవికకు కాస్త కీ రోల్ ఈమూవీలో ఉంది అని టాక్. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండతో కలిసి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లో నటించింది. అయితే ఆమూవీలో హీరో నాని కావడంతో మాళవిక డైరక్ట్ గా విజయ్ సరసన హీరోయిన్ కాకపోయినా ఆమూవీ హిట్ అయింది అన్న సెంటిమెంట్ విజయ్ కి ఉంది అని అంటున్నారు. దీనితో విజయ్ కి మాళవిక అదృష్టం ఎలా కలిసి వస్తుందో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: