రష్మిక డేట్స్ గురించి టాప్ హీరోలు అంతా ఎదురు చూస్తుంటే మహేష్ రష్మిక మ్యానియాకు చెక్ పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో రష్మిక మహేష్ తో నటిస్తున్న విషయం తెలిసిందే. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో రష్మిక పాత్రకు ఎటువంటి గ్లామర్ తో కూడిన ఎక్స్ పోజింగ్ సీన్స్ పెట్ట వద్దని మహేష్ ఈ మూవీ దర్శకుడు అనీల్ రావిపూడికి సలహా ఇచ్చినట్లు టాక్. అంతేకాదు ఆమె పాత్రను ఎంత వరకు అవసరమో అంతవరకే ఈ మూవీలో ఉంచమని అనవసరపు పాటలు గ్లామర్ ఎక్స్ పోజింగ్ సీన్స్ తమ మధ్య చిత్రీకరించ వద్దని మహేష్ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. 

దీనితో రష్మిక పాత్ర పరిధిని ఈ మూవీలో తగ్గించి మాస్ ప్రేక్షకుల కోసం ఈ మూవీలో రెండు ఐటమ్ సాంగ్స్ పెడుతున్నట్లు సమాచరం. ఒక స్పెషల్ సాంగ్ ను తమన్నాతో మరొక స్పెషల్ సాంగ్ ను పూజా హెగ్డేతో తీయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు సమాచారం. ‘సైరా’ ప్రమోషన్ లో పాల్గొంటున్న తమన్నా తాను మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. 

ఈ విషయమై పూజా హెగ్డే కూడ ఇలాంటి లీకులు ఇస్తోంది. దీనితో ఈ మూవీలో రెండు స్పెషల్ సాంగ్స్ ఉండబోతున్నాయి అన్న సంకేతాలు వస్తున్నాయి. రష్మిక చాల మంచినటి అని చెపుతూనే మహేష్ ఆమె గ్లామర్ షోకు పనికిరాదు అని సంకేతాలు ఇస్తున్న పరిస్థితులలో మహేష్ రష్మిక పై ఏర్పరుచుకున్న అభిప్రాయం ఆమెకు వరమా శాపమా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తిగల చర్చలు జరుగుతున్నాయి. దీనితో టాప్ యంగ్ హీరోలలో రష్మిక మ్యానియాకు అంతరాయం కలుగుతుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: