భారతదేశం నుంచి విదేశాల్లోకి వెళ్లి... అక్కడ మంచి ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడి... కరోనా దెబ్బకు అక్కడ ఉండలేక, ప్రాణ భయంతో భారత్ వచ్చేశారు చాలా మంది. అమెరికా, సహా గల్ఫ్ దేశాల్లో ఉండి... ప్రాణ భయంతో, ఆర్ధిక ఇబ్బందులతో భారత్ వచ్చేశారు వేలాది మంది. వారిని తీసుకుని రావడానికి గానూ కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. వేలాది మందిని భారత్ తీసుకుని వచ్చింది. అంత వరకు బాగానే ఉందిగాని... గల్ఫ్ దేశాల నుంచి భారత్ వస్తు వస్తూ కొందరు చక్కగా కొన్ని కార్యక్రమాలు చేసారు.


ఆడాళ్ళ లో దుస్తుల్లో బంగారం తరలించారట... కొన్ని కొన్ని చోట్ల కరోనా భయంతో కస్టమ్స్ కూడా చూసి చూడనట్టు వ్యవహరించింది. దీనితో కేజీల  కొద్దీ బంగారం గల్ఫ్ దేశాల నుంచి భారత్ తీసుకొచ్చారు ఎన్నారై లు. ఇక స్మగ్లర్లు కూడా ఈ విషయంలో చాలా వరకు ఎన్నారై లను నమ్ముకున్నారు. వందల కేజీల బంగారం వందే భారత్ మెషిన్ పుణ్యమా అని వచ్చేసింది అని అంటున్నారు.  కనీసం 500 నుంచి వెయ్యి కోట్ల వరకు బంగారం స్మగ్లింగ్ జరగవచ్చు అని అంచనా వేస్తున్నారు. విదేశాల్లో ఉన్న వారు అందరూ  ఇక్కడి నుంచి డబ్బులు ఖాతాల్లో జమ చేయించుకుని తీసుకోచ్చారట.


ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి భారీగా తరలించి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. అమెరికా సహా కొన్ని దేశాల నుంచి కూడా తరలించే అవకాశం ఉంది అని అంటున్నారు.   రాజకీయ నాయకులు కూడా ఎన్నారై ల ద్వారా బంగారం తరలించి ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. దీనితో ఇప్పుడు వందే భారత్ మెషిన్ లో భాగంగా భారత్ వచ్చే విమానాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అని అంటున్నారు. గల్ఫ్ దేశాల విమానాల మీదనే ప్రత్యేకంగా ఫోకస్ చేసారట.

మరింత సమాచారం తెలుసుకోండి: