సాధారణం గా గిన్నిస్ బుక్ రికార్డుకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఎంతో మంది ఆహారతీయులు కొన్ని రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచనల్లో ఒకవేళ చికెన్ తినే పోటీలు పెడితే ఎంత బాగుండు అందులో ఎక్కువ చికెన్ తిని మేమే గిన్నిస్ బుక్ రికార్డు సాధించే వాళ్ళం అని అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక సరదాగా అప్పుడప్పుడు స్నేహితులు కలిసినప్పుడు చికెన్ తినే పోటీలు కూడా పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి. కానీ కేవలం చికెన్ కాళ్లు మాత్రమే తినే పోటీ గురించి ఎప్పుడైనా విన్నారా.


 అదేంటి ఎవరైనా సరే చికెన్ తింటారు ఇక వాటి కాళ్ళను చెత్త లో పడేస్తూ ఉంటారు. కానీ కోడి కాళ్ళను తినడం గురించి పోటీ పెట్టు కోవడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా. ఇక్కడ ఇలాంటి పోటీయే జరిగింది. ఉడకపెట్టిన కోడి కాళ్ళను తిని ఇక్కడ ఒక మహిళ రికార్డు సృష్టించింది.  దక్షిణాఫ్రికాకు చెందిన ఉయెల్వెతు సీమానైల్ అనే యువతి 60 సెకండ్లు ఏకంగా మూడున్నర కోడి కాళ్ళను తినేస్తుంది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సృష్టించింది. డార్బన్ లోని ఉమ్లాజీ లో ఉన్న మాశం ప్లేన్స్ లాంజ్ రెస్టారెంట్ అండ్ బార్ లో ఇటీవల జరిగిన ఓ పోటీ లో ఈ రికార్డు సృష్టించింది.


 అయితే ఈ పోటీ లో ఏకంగా ఐదుగురు యువతులు పాల్గొన్నారు. ఒక యువతి ఉడకబెట్టిన కాళ్ళను నోట్లో పెట్టుకోగానే కడుపులో తిప్పడంతో అక్కడి నుంచి ఒక్క సారిగా లేచి వెళ్ళి పోయింది.ఈ క్రమం లోనే పోటీ నుంచి తప్పకుంది. కానీ మిగతా నలుగురు మాత్రం ఎంతో కష్టం గా కోడి కాళ్లు తినడానికి ప్రయత్నించారు. అయితే సిమైనల్ అనే యువతి మాత్రం ఎక్కడ ఇబ్బంది పడకుండా మూడున్నర కోళ్లకు సంబంధించిన కాళ్ళను తినేసి ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: