ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మొత్తం  రాజ‌కీయాల వేడికి రోజురోజుకు అట్టుడుకిపోతోంది. ఓవైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబు దీక్ష‌కు పూనుకోవ‌డం.. మ‌రోవైపు వైసీపీ నాయ‌కులు జనాగ్ర‌హ దీక్ష‌ల‌కు పిలుపునివ్వ‌డం.. ఇటీవ‌ల వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి జ‌నాగ్ర‌హ దీక్షలు చేప‌ట్ట‌నున్న‌ట్టు వెల్ల‌డించిన విష‌యం విధిత‌మే. అక్టోబ‌ర్ 21, 21 తేదీల‌లో దీక్ష‌లు ఉంటాయ‌ని వివ‌రించారు.

రాష్ట్ర నాయ‌కులు, జిల్లానాయ‌కులు, మండ‌ల నాయ‌కుల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు స‌జ్జ‌ల‌. ముఖ్యంగా అన్ని జిల్లా కేంద్రాలు, ప్ర‌ధాన కూడ‌ళ్ల వ‌ద్ద జ‌నాగ్ర‌హ దీక్ష‌లు చేప‌ట్టాల‌ని దిశానిర్దేశం చేశారు. దీంతో గురువారం ఉద‌యం నుంచే వైసీపీ నాయ‌కులు జ‌నాగ్ర‌హ దీక్ష‌లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల‌లో దీక్ష‌లో పాల్గొని ప్రతిపక్ష‌ నేతల‌పై దుమ్మెత్తిపోశారు. రెండు రోజుల పాటు దీక్షలు కొన‌సాగుతాయి. మ‌రోవైపు ప‌ట్టాబీ టీడీపీలో పెద్ద లీడ‌ర్ ఏమి కాదు. చంద్ర‌బాబు ఎప్పుడు ఎవ‌రో ఒక‌ర్ని బ‌లిప‌శువులుగా మార్చుతాడు. ఎప్పుడు ప్ర‌శాంతంగా ఉండ‌డం ఆయ‌న‌కు ఇష్టం ఉండ‌దు అని నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  

చంద్ర‌బాబు త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని వైసీపీ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు.  ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్లు, జ‌డ్పీటీసీలు, ఎంపీటీసీలు, స‌ర్పంచ్ త‌దిత‌ర నాయ‌కులు దీక్ష‌ల‌లో పాల్గొన్నారు. టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాబిరామ్ మాట్లాడిన బూతుల‌కు నిర‌స‌న‌గా దీక్ష‌కు పూనుకున్న‌ట్టు నాయ‌కులు వెల్ల‌డిస్తున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పొయార‌ని, సీఎంను, మంత్రులను ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిట్ట‌డం ఏమిట‌ని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌ట్టాబిని అరెస్టు చేసి విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. టీడీపీ వైఖ‌రీని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకొచ్చేందుకు దీక్ష‌లు చేప‌ట్టిన‌ట్టు కొంద‌రు నాయ‌కులు పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాష్ట్రంలో ఏ ఎన్నిక‌ల్లో గెల‌వ‌కుండా ఉండ‌డంతో ఇలాంటి ఘాతుకాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు వివ‌రించారు. చంద్ర‌బాబు కావాల‌నే ప‌ట్టాబితో ఈ వ్యాఖ్య‌లు చేయించార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జ‌గ‌న్‌పై  టీడీపీ నాయ‌కులు దుర్భాష‌లాడ‌టం.. వారి ప్ర‌వ‌ర్త‌న కుట్ర‌రాజ‌కీయాల‌కు దారి తీసేవిధంగా ఉంద‌ని మండిప‌డుతున్నారు. మొత్తానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాష్ట్రం అంతా ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: