రాజకీయంలో ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులు ఎప్పుడు సేఫ్ గానే ఉంటారు.. కానీ వారి మధ్య ఇరుక్కున్న అధికారుల పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది.. వీలైతే ట్రాన్స్ ఫర్స్, సస్పెన్షన్స్, లేదంటే డిస్మిస్ ఇది మన అధికారాలుగా రాజకీయ నాయకులు ఇచ్చే గౌరవం.. పని ఉన్నంత సేపు అధికారులను వాడుకుని వారికి వ్యతిరేక పనులు చేస్తే వారిని ఎక్కడికో పారేస్తారు.. ఇక తాజాగా ఏపీ లో అలాంటి స్థితి ఇద్దరు పోలీస్ అధికారులకు ఎదురైంది.. ఇటీవలే చిలుకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీపై నిఘా పెట్టిన కారణంగా ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడిన సంగతి అందరికి తెలిసిందే..