ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో రోజుకీ మూడు లక్షలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రులు కరోనా బాధితులతో నిండిపోయాయి. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది కంటి మీద కునుకు లేకుండా సేవల్లో పాల్గొంటున్నారు.