రాజకీయాలకు రక్తసంబంధాలు కూడా అడ్డురావు. ఒకే కడుపున పుట్టిన వారు సైతం వేరువేరు పార్టీల్లో ఉన్నవారినెందరినో చూశాం.. నందమూరి బాలకృష్ణ, పురందేశ్వరి అందుకు తాజా ఉదాహరణలు.. ఇప్పుడు ఈ కోవలోనే మరో సెలబ్రెటీ చేరబోతున్నారు. ఆయనే చిరంజీవి మరో సోదరుడు నాగబాబు. 

చిరంజీవి ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. ఆ దుకాణం మూసేసి.. కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ తర్వాత మరో తమ్ముడు జనసేన పార్టీ పెట్టి చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు వీరి మరో సోదరుడు నాగబాబు.. వెరైటీగా వైసీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. 

త్వరలోనే నాగబాబు వైసీపీలో చేరవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఈ విషయంపై ఆయన ఓ క్లారిటీకి రాలేదట. కానీ ఎక్కువశాతం జగన్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయట. అందుకు ఆయన సహనటి జబర్దస్త్ జడ్డి రోజా యే కారణమని అంటున్నారు. జగన్ కూ నాగబాబుకూ మధ్యవర్తిత్వం నెరపింది రోజాయేనట. 
ది నిజమైతే సంచలనమే కదా. నాగబాబు కు కాకినాడ ఎంపీ స్థానాన్ని జగన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరి నాగబాబు వైసీపీలో చేరిపోతారా.. 



మరింత సమాచారం తెలుసుకోండి: