
బ్రాంచ్ సెక్రెటరి ఆనందరావు, మానేజర్ కాబిన్ నుంచి భుజాలనెగురవేస్తూ, ముఖమంతా ఆనందము పులుముకుంటూ బయటకువచ్చారు. మేమంతా బ్రాంచ్ లెవల్ ప్రాబ్లంస్ ను మా సెక్రటరీ ద్వారా సాల్వ్ చేసుకుంటూ వుంటాము. ఎమైందండీ? అనందరావ్ గారు! మానేజర్ మన డిమాండ్ ఒప్పుకున్నారా? అంటూ ఆయన చుట్టూ మూగాము. దానికి ఆనందరావ్ గారు మానేజర్ ని వాయించేశానండి. దెబ్బకి షాక్ తిన్నాడు. ఒక్క సారి భయపడిపోయాడు. ఒక్కో డిమాండ్ ని క్రమంగా ఇంప్లిమెంట్ చేస్తానని ముందుగా మన బ్రాంచ్ లో డైనింగ్ రూం ఏర్పాటు చేయటానికి పర్మిషన్ ఇచ్చారు.
బ్రాంచ్ బిజినెస్ స్టార్ట్ అవటంతో అందరం బిజీ అయ్యాం. కాస్త ఫ్రీ టైంలో ఆఫీసర్ రఘు, "సరిత గారు! ఆనందరావ్ భలే స్టోరీ చెప్పాడండీ మీకు" అదేంటి? అంటూ ఆయనవైపు చూశాను. "ఆఫీసు పని చేయకుండా యునియన్ అంటూ వెధవ మీటింగులు పెడితే తోలు వలుస్తా జాగ్రత్త - నీ పాత చరిత్ర బయట పెట్టటమేకాదు, నీ సెకండ్ సెటప్ గురించి మీ ఆవిడకు చెప్పేస్తా. దాంతో ఇక్కడ ఆఫీసులో, అక్కడ ఇంట్లో , చివరకు నీ ఒంట్లో కూడా మనశ్శాంతి లేకుండా చేస్తా జాగ్రత్త" అనటంతో రావ్ గారికి చెమటలు పట్టాయ్. హెడ్డాఫీస్ డైనింగ్ రూం ఏర్పాటు చేయమని పర్మిషన్ ఇచ్చి ఒక నెలైంది. ఆ ఆర్డర్ కాఫీ ఆయన దగ్గర పెట్టుకొని ఆ పని చేయలేదు. దానికి కూడా చివాట్లు పెట్టాడు. కాబిన్ నుంచి బయటకు వచ్చి మీదగ్గర వాగిన వాగిడు విన్నాను.
కాబిన్లో పెట్టిన చివాట్లు మీకెలా తెలుసు? అన్నాను షాక్ తో. దానికి మేడం ! నేను మానేజర్ గారి అల్మైరాలో ఉన్న క్రెడిట్ శాంక్షన్ లెటర్స్ చూస్తు న్నాను. నేనులోపల ఉన్న విషయం, ఆనందరావ్ గమనించలేదు అని ముగించాడు. మనుషులు ఇలా కూడా ఉంటారా! అనిపించి ఆరోజుకు మౌనంగా ఉండిపోయాను, పనుల్లో మునిగిపోయి.
**********************************
ఆదివారం కావటంతో మా శ్రీవారు ఇంకా రాత్రి పెట్టుకున్న ముసుగునుండి బయటకు రాలేదు. నాకేమీ తోచక అక్కడ పేపర్ బోయ్ విసిరిన ఈనాడు పేపర్ హెడ్-లైన్స్ చూస్తున్నాను. ఆ వార్త చూసి, కాస్త నిన్నటి ఆనందరావ్ కథ గుర్తుకొచ్చి నాకు నవ్వాగలేదు. ఆ వార్తేమంటే మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్రపతి గారిని కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించటానికి వెళితే, ఆయన, " మీ అంతటి గొప్ప పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఇంకొండరుంటే ....బయటికే నవ్వేశా.
మెయిన్ హెడ్డింగ్ : అందరూ మీలా పనిచేస్తే చాలు -
సబ్ హెడ్డింగులు: దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుంది.
చంద్రబాబుకు రాష్ట్రపతి ప్రశంశలు.
పుష్కరాలకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ —
వార్తలో కొంత: "మీరు ప్రతివిషయంలో సానుకూల దృక్పదంతో ఉంటారు. మీలాంటి ముఖ్యమంత్రులు ఇంకొందరు ఉంటే దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుంది. చంద్రబాబును రాష్ట్రపతి ప్రశంసించారు"., ఇంకా ఆయనను నీటిసమస్య తీర్చినందుకు, పట్టిసీమ పూర్తిచేసినందుకు, బిల్-క్లింటన్ నుంచి అభినందనలు పొందటం....." గురించి ప్రస్తానించారని ఈనాడు రాసింది. పుష్కరాలకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
రాజకీయాలు తెలియని నాకు - మానేజర్ ప్లేస్ లో రాష్ట్రపతి, ఆనందరావ్ ప్లేస్ లో చంద్రబాబు, నిజం చూసి నిజం చెప్పిన రఘు ప్లేస్ లో -ఏమీ చూడకుండానే అంతా తెలిసినట్లు చంద్రబాబు గొప్పతనాన్ని రాష్ట్రపతి మెచ్చుకున్నట్లు రాసిన ఈనాడు కనిపించాయి. అక్కడైతే రఘు ఆనందరావ్ విషయం లో ప్రత్యక్ష సాక్షి. ఈనాడుకు గాని ఇంకెవరితోనైనా రాష్ట్రపతి ఈ విషయం చెప్పరు. మరిక బాబు చెప్పినట్లు ఈనాడు రాయలేదు. బాబు చెప్పినా ఆయన ఆనందరావే నాదృష్టిలో.
నానవ్వు విన్న మాయన బయటికి వచ్చి నా డౌటుకు చక్కటి సమాదానం చెప్పారు.అదేమంటే " రాష్ట్రపతి కాంగ్రెస్ వాది. చంద్రబాబును పొగడాల్సిన అవసరం లేదు ఆయనకు, అయినా బాబుకు ముఖస్తుతి చేయవలసిన అవసరం కాని, స్థాయికాని ఆయనది కాదు. భారత రాష్ట్రపతి ఏదైనా మాట్లాడితే పబ్లిక్ గానే చెప్పుతారు. ఇదంతా ఈనాడు బాబుకు బాకా ఊదటమే. కుల సాంప్రదాయం. నువ్వు నా కీర్తి పెంచు నేను నీ కీర్తి పెంచుతా అనే థియరీ"
అనిచెప్పటంతో ఈనాడు నైజం అర్ధమయ్యి నవ్వుతూ ఇంటిపనులు గుర్తొచ్చి ఇంటిలోపలికి వెళుతున్న నాకు "ఈనాడు, చంద్రబాబుల పరస్పర కుచ మర్ధనం" అన్నట్లు వినిపించింది, ఆభాషకు ఏదో గుర్తొచ్చి వెనక్కి తిరిగి కొంచం కోపంగా చూస్తే మా ఆయన కన్నుగీటారు చిలిపిగా.