ఆ రాష్ట్రంలో వ్యవసాయ బడ్జెట్ తయారు చేస్తున్నారు. దాన్ని అసెంబ్లీలో సమర్పించే ముందు.. సీఎం భలే వినూత్నమైన పని చేశారు. వ్యవసాయశాఖ బడ్జెట్ కాబట్టి వెరైటీగా ఎమ్మెల్యేలందరికీ మామిడి కాయలు, మామిడి మొక్కలు గిఫ్ట్ గా పంపారు.


ఇంతకీ ఆ రాష్ట్రం ఏంటో చెప్పలేదు కదా.. బీహారు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పంపిన ఈ వెరైటీ గిఫ్టుపై ఎమ్మెల్యేలు తలా ఒక రకంగా స్పందిస్తున్నారు. సీఎం చేసిన ఈ పని చాలా బావుందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మెచ్చుకుంటున్నారు.


విపక్షాలు మాత్రం దీన్ని తప్పుబడుతున్నాయి. ఇటీవల బీహార్ లో ఆరోగ్య పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. సుమారు 150 మంది పిల్లలు మెదడు వాపు వ్యాధితో చనిపోయారు. అసెంబ్లీలో ఆ విషయాలపై రచ్చ జరగకుండా సీఎం నితీశ్ కుమార్ ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: