కృష్ణా నదీ కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసాన్ని జగన్ సర్కారు టార్గెట్ చేసిందని వైసీపీ నేతలు అంటున్నారు. అది అక్రమ కట్టడమని తెలిసినా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంకా ఎందుకు అందులో ఉంటున్నారని వైసీపీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఓ వారం రోజుల్లో కూల్చేస్తామని కూడా సీఆర్డీఏ నోటీసులు కూడా ఇచ్చేసింది. ఇక చంద్రబాబు ఇల్లు కూల్చడమే మిగిలింది.


అయితే చంద్రబాబు ఇల్లు తరవాత జగన్ సర్కారు టార్గెట్ ఎవరు..? ఇందుకు సమాధానం ఏకంగా మంత్రి అనిల్ కుమార్ నోటి నుంచే వచ్చింది. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ... "ఇవాళ దేవినేని ఉమా కూర్చొని మాట్లాడుతున్న స్థలం ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిందన్నారు. ఒక్క సైట్‌ను కేవలం రూ.1000 చొప్పున లీజుకు తీసుకొని ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఉమాకు దమ్ముంటే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని సూచించారు.


మరి ఇంతకూ ఉమా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన స్థలం ఏది.. అది టీడీపీ పార్టీ కార్యాలయం.. అంటే అది కూడా ప్రభుత్వ స్థలమేనా.. అంటే అది కూడా కూల్చి వేతల జాబితాలో ఉందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా మంత్రి అనిల్ ఏమన్నారంటే.. పారదర్శకతతో తీసుకొచ్చిన మొట్టమొదటి రివర్స్‌ టెండరింగ్‌ విజయవంతం కావడం శుభపరిణామమన్నారు. అప్పుడే టీడీపీ నేతలు మాట్లాడటం మొదలుపెట్టారు. పారదర్శకతతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే..ఎక్కడ తమ బంఢారం బయటపడుతుందని, దోచుకున్నది బయటపడుతుందన్న భయంతో రకరకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో మూడేళ్ల క్రితం పిలిచిన పనుల్లో ఒక్కటైనా పూర్తి చేశారా అని నిలదీశారు.


ప్రాజెక్టు నిర్మాణాల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రివర్స్‌ టెండరింగ్‌కు శ్రీకారం చుట్టారని, ముఖ్యమంత్రి ఆలోచన నిజమైందని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. వరదల కారణంగా రెండు నెలల పాటు పనులు నిలిపివేస్తే..పోలవరం ఆగిపోయిందని రకరకాలుగా ప్రచారం చేశారన్నారు. ఇన్ని కోట్లు, అన్ని కోట్లు నష్టమని ఎల్లో మీడియా విష ప్రచారం చేసిందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: