సభలో మళ్లీ రగడ చోటుచేసుకుంది. తెలంగాణ బిల్ల చర్చకు వచ్చింది అని కొందరు, కాలేదని కొందరు అంటూ తెగ సందిగ్దం సృష్టించిన నేపథ్యంలో మంగళవారం నాటి సభ ఆసక్తిగా మారింది. పైగా ఈ సభకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా హాజరుకావడంతో ఏంజరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో సభ ప్రారంభం కాగానే సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో హోరేత్తింది. ఈ గందరగోళం మద్యనే స్పీకర్ విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మాణాలను తిరస్కరించారు. అనంతరం బిఏసి సమావేశం నిర్వహిస్తున్నామని, దీనికి సంబందిత సభ్యుల హాజరుకావాలని స్పీకర్ కోరారు. ఈ సమావేశం తర్వాతనే సభ తిరిగి ప్రారంభం కానుంది. తెలంగాణ బిల్లు చర్చకు వచ్చింది అని తెలంగాణ వారు, రాలేదని సీమాంద్ర వారు తెగ గొడవ పడుతున్న తరుణంలో బిఏసి సమావేశం కీలకం కానుంది. బిల్లపై చర్చ నిన్ననే మొదలైంది, అవసరమైతే మిగిలిన బిల్లుల విషయమై మాత్రమే బిఏసి సమావేశంలో చర్చించాలని, తెలంగాణ బిల్లుపై ఇక చర్చించాల్సిన అవసరం లేదని టిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేసారు. దీనిని సీమాంద్ర ప్రాంతం మంత్రులు, ఎమ్మెల్యేలు తిరస్కరించారు. దీంతో బిఏసి సమావేశం ఏంచేస్తుందనేది కీలకంగా మారింది. పరిస్థితి చూస్తే మాత్రం సభ సజావుగా జరిగే అవకాశాలయితే కనిపించడం లేదు. ఒక వేళ వాయిదాల మీద వాయిదాలు పడితే పరిస్థితి ఏంటా అన్నది కూడా అందరిలో టెన్షన్ పుట్టిస్తోంది. మరో వైపు భారీగా పోలీసులను అసెంబ్లీలో మొహారించడంతో ఈ రోజు ఏదో సంచలనం చోటుచేసుకుంటుంది అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చివరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: