రోజు ఉదయాన్నే లేవాలి అంటే.. ఒకప్పుడైతే కోడిపుంజు కొక్కరకో అని కూయగానే  నిద్రలేచేవారు... కానీ ఇప్పుడు మాత్రం పొద్దున నిద్ర లేవాలి అంటే తల దగ్గర పెట్టుకున్న అలారం మోగగానే నిద్రలేస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఎంతో మందిని అలారమె  పొద్దున నిద్ర లేపుతూ ఉంటుంది. అయితే అలారం గణగణమని గంటలు కొట్టినట్టు సౌండ్ వచ్చినప్పటికీ... బీప్ బీప్ అని  చిన్న శబ్దాలు వచ్చినప్పటికీ... పొద్దున్నే నిద్రనుంచి మేలుకునే వాళ్ళు చాలామంది. కొంతమంది పొద్దున్నే అలారం రాగానే ఎంతో విసుక్కుంటూ ఉంటారు... అప్పుడే టైం అయిపోయిందా అంటూ గొణుక్కుంటూ ఉంటారు. కొంతమంది అలారం  ఆపేసి మళ్ళీ పడుకుంటే... కొంతమంది మాత్రం అలారం ఎంతసేపు వచ్చిన అలాగే. ముసుగు  తన్నుకుని పడుకుంటారు. అయితే అలారం గంట కొట్టినట్లు లేదా బీట్ శబ్దం తో   నిద్ర లేవడం కంటే  మనకి ఇష్టమైన శ్రావ్యమైన సంగీతాన్ని అలారం గా పెట్టుకుంటే త్వరగా నిద్రలేవడం తో పాటు రోజంతా ఉల్లాసంగా ఉండే అవకాశం కూడా ఉంది. 

 

 

 అయితే దీనికి సంబంధించిన కారణాలను కనుగొనేందుకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు 50 మందిపై అధ్యయనం చేశారు. ఓ రహస్య నిషేధించారు. అయితే ఇష్టం లేని అలారాన్ని విన్నప్పుడు నిద్రలో ఉన్న మనుషుల మెదడు గందరగోళానికి గురి అవుతుంది అని ఈ పరిశోధనలో వెల్లడైంది. అయితే ఇష్టం లేని శబ్దాన్ని వినడం కంటే తమకు ఇష్టమైన ఎంతో శ్రావ్యమైనా  పాటను అలారం గా పెట్టుకుని పొద్దున్నే విన్నప్పుడు.. నిద్రలో ఉన్న వారి మెదడు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా... మెల్లగా అల్లారం గా వస్తున్న మనకి ఇష్టమైన పాటలు వినడానికి కోసం బాడీని నిద్రలో  నుంచి బయటకు తీసుకు వస్తుందని ఈ అధ్యయనంలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన వివరాలను అధ్యయనంలో పాల్గొన్న అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రు డయ్యాన్ ఓ  ప్రకటన విడుదల చేశారు. 

 

 

 అయితే ప్రస్తుతం ఉద్యోగాల్లో  ఎక్కువగా పని ఒత్తిడి నేపథ్యంలో ఉదయాన్నే నిద్ర లేవడానికి ఇష్టం లేని గంట శబ్దం పెట్టుకోవడం వల్ల ఆ రోజంతా ఎంతో చికాకుగా గడిచి  పోతుంద నీ ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇష్టమైన శబ్దాన్ని గానీ పాటలు గానీ అలారం పెట్టుకొని  ఆ పాట వింటూ నిద్రలేస్తే... రోజంతా ఎంతో చురుగ్గా ఉంటారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. మామూలుగానే ఇష్టమైన పాటలు వింటూ ఉంటే మెల్లగా అందరూ నిద్రలోకి జారుకుంటారు అన్న విషయం తెలిసిందే.. ఇష్టమైన పాట వింటూ నిద్రలో నుండి లేసిన  రోజంతా ఎంతో ఆహ్లాదంగా ఉండే అవకాశం ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: