తెలంగాణ ప్రభుత్వంలోనూ, టిఆర్ఎస్ పార్టీలోనూ... తను మాటే శాసనంగా చేసుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న కేసీఆర్ కు ఇప్పుడు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. తెలంగాణలో నెలకొన్న ప్రతి సమస్యను, పార్టీల నాయకుల మధ్య తలెత్తే వివాదాలను చాకచక్యంగా పరిష్కరిస్తూ వస్తున్న కెసిఆర్ కు ఇప్పుడు ఇంటి పోరు ఎక్కువ అయినట్టు గా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్న నేపథ్యంలో వాటిపై ఆశావహులు చాలామంది తమకే దక్కుతాయని ఎదురు చూపులు చూస్తున్నారు. ఆ రెండు స్థానాలను దక్కించుకోవడానికి టిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎవరికి వారు పోటీ పడుతున్నారు. దీంతో ఈ రెండు స్థానాలను భర్తీ చేయడం కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. 


సరిగ్గా ఇదే సమయంలో మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో పరాజయం పొందిన కేసీఆర్ కుమార్తె కవిత కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్టు ప్రచారం మొదలైంది. అయితే ఆమె రాజ్యసభకు వెళ్లేందుకు నిరాకరించారనే వార్తలు వస్తున్నా ఇప్పుడు మాత్రం ఆమె రాజ్యసభకు వెళ్లాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కేసీఆర్ సతీమణి కూడా సపోర్ట్ చేయడంతో కేసీఆర్ కు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారినట్లు సమాచారం. రాజ్యసభకు పంపే విషయంలో కేసీఆర్, కేటీఆర్ గాని సముఖంగా లేరు. ఎందుకంటే కవితకు కనుక రాజ్యసభ సీట్లు ఇస్తే ఇప్పటికే తెలంగాణ సీఎంగా కేసీఆర్, మంత్రిగా కేటీఆర్ ఉన్నారు.


 కవితకు కూడా ఎంపీ గా అవకాశం కనిపిస్తే మొత్తం కెసిఆర్ తన కుటుంబానికి పదవులుఇచ్చుకున్నారు అనే అపవాదు వస్తుందనే ఉద్దేశంతో కవిత కు రాజ్యసభ సీటు ఇచ్చే విషయంలో కేసీఆర్ ఇష్టపడడంలేదని తెలుస్తోంది. అయితే కేసీఆర్ సతీమణి మాత్రం కవితకు ఎట్టి పరిస్థితుల్లో అయినా రాజ్యసభ సీటు ఇచ్చి తీరాల్సిందే అంటూ పట్టు పడుతున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా సాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కేసీఆర్ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: