స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావించిన సీఎం జగన్ నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ దూకుడుకు ఏపీ హైకోర్టు బ్రేక్ వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 రిజర్వేషన్లు కల్పించే జీవో 176 పైనా... బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించే ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్ల అమలుపైనా బి.ప్రతాప్‌రెడ్డితో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు.

 

 

దీనిపై విచారించిన కోర్టు.. ఈ రిజర్వేషన‌్ల అమలకు కోర్టు బ్రేక్ వేసింది. ఇలా రిజర్వేషన్లకు వీలు కల్పిస్తున్న ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్లు 9(1), 15(2), 152(1), 153(2), 180(1), 181(2బీ) చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. 50 శాతానికి మించి కోటా ఇవ్వడం సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకమని క్లారిటీ ఇచ్చింది.

 

 

అయితే ఇందులో చంద్రబాబు విషయం ఎందుకు వచ్చింది అంటారా.. ఈ రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లింది బిర్రు ప్రతాప రెడ్డి అనే వ్యక్తి. సదరు బిర్రు ప్రతాప రెడ్డి టీడీపీ నాయకుడేనట. బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లను బీసీ వ్యక్తితో కేసు వేయిస్తే బావుండదని కావాలని రెడ్డి కులస్తులతో చంద్రబాబు కేసు వేయించారని వైసీపీ నేతలు అంటున్నారు. బలహీనవర్గాలను మోసం చేయాలని సుప్రీం కోర్టు వరకు బిర్రు ప్రతాప్‌రెడ్డిని చంద్రబాబు వాడుకున్నాడని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు.

 

 

బలహీన వర్గాలు అంటే చంద్రబాబుకు ఎంత చిన్న చూపో అర్థం చేసుకోండి. రెడ్డి అనే తోక ఉంది.. వైయస్‌ఆర్‌ సీపీపై నింద వేయవచ్చు అని ప్రతాప్‌రెడ్డిని సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు పంపించాడు. బలహీనవర్గాలకు పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాత్రమే. వైయస్‌ జగన్‌ అభినవ పూలే. వైయస్‌ జగన్‌ చేస్తున్న కార్యక్రమాలను ఏదో విధంగా దెబ్బతీయాలని, కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుకోవాలని కుట్రపూరిత ధోరణితో వ్యవహరించాడని జోగి రమేశ్ మండిపడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: