జనసేనానికి మరియు జనసేనులకు వరుస షాకులు తగులుతున్నాయి. గత ఎన్నికలలో ఘోర ఓటమి చవి చూడటంతో అందులోని చాలా మంది నేతలు వరుస క్యూలు కట్టారు. వెళ్లి వెళ్లడంతోనే సదరు నేతలు ప్రస్తుత అధికార పార్టీలోకి వలస వెళ్లడం మనం చాలా నెలలుగా మనం గమనిస్తూ వున్నాం. ఇక తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత పసుపులేటి బాలరాజు ఇటీవలే జనసేన పార్టీకి రాజీనామా చేసి, సదరు  రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు పంపారు. 

 

ఇదిలా ఉండగా, ప్రస్తుతము అయన తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరడం ఇపుడు పలు చర్చలకు దారి తీస్తోంది. ఆయనతో పాటుగా, మరికొందరు కూడా కండువాలు కప్పుకున్నారు. ఇక బాలరాజు నేపధ్యం గాని మనం పరిశీలించినట్లయితే.. 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నుండి, జనసేన తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీమతి భాగ్యలక్ష్మి చేతిలో ఘోరంగా ఓడిపోయారు.

 

ఇక ఆనాటినుండి కూడా అతను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం మనకు విదితమే. అందువలన  బాలరాజు పార్టీ మారతారని కొద్దిరోజులుగా గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఇక, జనసేనకు రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయం పైన కూడా కొద్ది కాలంగా చర్చ నడుస్తోంది. పలువురు విశ్లేషించిన మాదిరిగానే, చివరికి అధికార పార్టీలోకి ఆటగాడు జంప్ అవ్వడం కొసమెరుపు. 

 

ఇతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. అలాగే శ్రీ వైఎస్‌ రాజశేఖర్ కు ఇతనికి మధ్య మంచి సన్నిహిత సంబంధం కూడా వుంది.. గతంలోనే ఆయన వైఎస్సార్సీపీలో చేరతారని అందరూ  అనుకున్నప్పటికీ, అందరి అంచనాలను తల క్రిందలు చేస్తూ.. అతను జనసేనలో కలిసాడు. ఇక మరల ఇపుడు అతను గతంలో అందరూ ఊహించినట్లు వైఎస్సార్సీపీకి వలస వెళ్లారు. దీనివెనుక గల ఆంతర్యం ఏమిటన్నది ఇపుడు అసలు విషయం... 

మరింత సమాచారం తెలుసుకోండి: