స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీ ముఖ్య నేతలు చంద్రబాబుకు వరుస షాకులు ఇస్తున్నారు. ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ బీజేపీ బంధాన్ని కూడా ప్రభాకర్ బయటపెట్టారు. తెలుగుదేశం పార్టీని వీడటం తనకు బాధగా ఉందని అయినా తప్పడం లేదని చెప్పారు. 
 
రాష్ట్రంలో టీడీపీకి మనుగడ లేదని చెప్పారు. టీడీపీ విధానాల వల్ల తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఒక బీజేపీ నాయకుని మాటలకే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఆ బీజేపీ నాయకుడి వల్ల పార్టీలో ఉన్నా పెద్దగా తమకు విలువ లేదని వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల వల్లే పార్టీని వీడుతున్నానని స్పష్టం చేశారు. 
 
పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి, అనుచరులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని చెప్పారు. టీడీపీని ఈ కారణాల వల్లే తాను వీడుతున్నానని వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఏ పార్టీలో చేరాలనుకుంటున్నానో అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. 
 
తన సోదరుడు కేఈ కృష్ణమూర్తి గురించి తనకు తెలియదని వైసీపీ నుండి ఆహ్వానం అందితే తాను వైసీపీలో చేరతానని చెప్పారు. కోట్ల కాంగ్రెస్ పార్టీ విధానాలనే టీడీపీలో అవలంబిస్తున్నారని అన్నారు. టీడీపీలో కోట్ల కుటుంబం చేరినప్పుడే తాను రాజీనామా చేయాల్సి ఉందని చెప్పారు. 2019లో కర్నూలు జిల్లా డోన్ నుండి పోటీ చేసిన ఈయన వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ చేతిలో ఓటమిపాలయ్యారు.                             
 

మరింత సమాచారం తెలుసుకోండి: