పదే పదే చెబితే అబద్దం నిజమైపోతుందని రాజకీయ నాయకులు కొందరు నమ్ముతారు. దాన్నే గోబెల్స్ ప్రచారం అంటుంటారు. చంద్రబాబు ఎక్కువగా ఇలాంటి ప్రచారం చేస్తారని వైసీపీ నాయకులు ఆరోపిస్తుంటారు. కానీ వైసీపీ నాయకులు కూడా ఆ విషయంలో తక్కువ తినలేదని అర్థమవుతోంది. స్థానిక ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న మాచర్ల ఘటన వైసీపీకి చెడ్డ పేరు తెచ్చిన సంగతి తెలిసిందే.

 

 

మాచర్లలో బోండా ఉమ, బుద్దా వెంకన్న వెళ్తున్న కారుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే వైసీపీ సోషల్ మీడియా కూడా దీనికి కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. అసలు ఆ కారుపై వైసీపీ నాయకులు దాడి చేయలేదని.. ఓ వికలాంగుడిని ఢీకొట్టి వెళ్తుంటే స్థానికులే తిరగబడి దాడి చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. కానీ ఆ వెంటనే టీడీపీ శ్రేణులు ఆ ప్రమాదం ఫోటో ఫేక్ అనీ... అది 2017లో జరిగిన ఓ ప్రమాద ఘటన అనీ పాత ఫేస్‌బుక్ ఫోటోతో వైసీపీ ప్రచారాన్ని కౌంటర్ చేశారు. అది ఏ సమయంలో ఎక్కడ జరిగిందో కూడా తేల్చి చెప్పారు.

 

అసలు ఒకవేళ వైసీపీ నాయకులు చెప్పిందే నిజమైతే.. ఆ పిల్లవాడు ఎవరు..? ఆ ప్రమాదం ఎక్కడ జరిగింది..? ఆ పిల్లవాడిని ఏ హాస్పిటల్‌లో చేర్చారు..? వంటి వివరాలే బయటకు రాలేదు. కనీసం వైసీపీ అనుకూల మీడియాలో కూడా ఆ వికలాంగుడి వార్త కనిపించలేదు. దీంతో ఆ వికలాంగుడిని గుద్దారన్న వార్త ఫేక్ అన్న అభిప్రాయం మరింతగా బలపడింది. ఇక ఆ ఇష్యూ మరుగున పడే సమయంలో మంత్రి బొత్స మరోసారి ఆ విషయాన్ని కెలుక్కున్నారు.

 

ఆయన మీడియాతో మాట్లాడుతూ... మాచర్ల సంఘటనకు కారణం ఏంటి? బోండా ఉమా, బుద్ధా వెంకన్న అక్కడకు ఎందుకు వెళ్లారు. ఇద్దరూ పది కార్లలో వెళ్లారు. అక్కడ ఒక వికలాంగుడ్ని గుద్దారు. ఆపి వైద్యానికి పంపకుండా వారిపై కలబడి దూషించి ముందుకు వెళ్తే ఏ ప్రజలు ఊరుకుంటారో చెప్పాలి. అంటూ మళ్లీ అదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో పదే పదే.. ఎందుకలా బొంకుతావు బొత్సా..? వైసీపీని భ్రష్టు పట్టించేలా ఉన్నావే..? అని వైసీపీ నాయకులే తలపట్టుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: