కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తుంది. ఇప్పుడు ఈ వ్యాధి మన దేశంలో అడుగు పెట్టడంతో అందరు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఏపీలో జరగబోయే స్థానిక ఎన్నికల కూడా కరోనా వైరస్ వల్లన వాయిదా పడ్డాయి. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నదున్న ఎన్నికల్లో సమయంలో ప్రజలు ఇలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎన్నికలు వాయిదా వేసినట్టు ఈసీ తెలిపారు.

 

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై వివాదం రాజుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. దీనిపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం, ఈసీపై ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు కోసమే ఈసీ రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేశారని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. 

 

సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు స్పందించారు.ఆయన వ్యాఖ్యలపై త్రీవ స్థాయిలో ధ్వజమెత్తారు.మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్ కుమార్‌ను తాము నియమించలేదని చంద్రబాబు తెలిపారు.

 

సీఆర్‌ బిశ్వను ఎస్‌ఈసీగా ప్రతిపాదిస్తే అప్పటి గవర్నర్ నరసింహన్‌ మాత్రం రమేష్ కుమార్‌ను ప్రతిపాదించారని గుర్తు చేశారు. ఆ విధంగా రమేష్ కుమార్‌ నియామకం జరిగిందన్నారు. రాజకీయ పబ్బం గడుపుకొనేందుకే ఆయన నియామకాన్ని సీఎం జగన్‌ తనకు ఆపాదిస్తున్నారని విమర్శించారు.

 

టీడీపీ నేతల ఇంటికి తెల్లవారుజామునే వెళ్లి బెదిరించారన్నారు. 111 మంది తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని తెలిపారు. పులివెందుల రాజకీయాన్ని రాష్ట్ర మొత్తం చేస్తానంటే ఊరుకోనని హెచ్చరించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసి ఉంటే వైసీపీ పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల వాయిదాపై సీఎం జగన్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని చంద్రబాబు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: