ప్రపంచ వ్యాప్తంగా అందరూ కరోనా వైరస్ కి భయపడి పోాతున్నారు.  ఎవరు తుమ్మినా.. దగ్గినా భయపడి పారిపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా విపత్తు కొనసాగుతుంది. ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ఈ కరోనా గురించి ఒక్కసారైనా మాట్లాడుతున్నారు. నిన్న కరోనా పై యుద్దం ప్రకటించాలని దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పదమూడు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కూడా ప్రకటించారు.  తెలుగు రాష్ట్రాల్లో నిన్న ముఖ్యమంత్రులు ఈ మేరకుప్రకటించారు. అయితే కరోనా తో లాక్ డౌన్ చేయడంతో ప్రయాణీకులు కష్టాలు వచ్చిపడ్డాయి.  మొన్నటి వరకు తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకారణంగా అత్యాధిక రేట్లు చెల్లించి ప్రయాణాలు చేసిన విషయం తెలిసిందే.

 

ఇప్పుడు ఈ పరిస్థితి మళ్లీ రిపీట్ అవుతుంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ చాలా మంది రోడ్లపైకి వస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉదయం నుంచి  ఆటోలు, ప్రైవేటు వాహనాలు తిరిగాయి. టీఆఎస్ఆర్టీసీ బంద్ కావడంతో ప్రైవేటు వాహనాలు ధరలు పెంచేస్తున్నాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం కావడం గమనార్హం. దీంతో టోల్ గేట్లను మూసేశారు.  ఇళ్లలోంచి బయటకు వచ్చిన వారికి కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి వెనక్కి పంపుతున్నారు.

 

మరికొన్ని చోట్ల లాక్ డౌన్న ఉన్నప్పటికీ ప్రజలు తమ ఇష్టాను సారంగా గుంపులుగా ఉండటంతో పోలీసులు వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చి పంపతున్నట్లు తెలుస్తుంది.  మరికొన్ని చోట్ల కరోనా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ బైకులపై చక్కర్లు కొడుతూ...  యథేచ్ఛగా తిరుగుతోన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచుతామని తెలిపారు. వారి వాహనాలు సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌లకు తరలించామని చెప్పారు. మెడికల్‌, నిత్యావసర వస్తువులు తీసుకునేందుకు మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: