దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా శరవేగంగా విజృంభిస్తోంది. దేశంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండగా వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. కరోనా విజృంభణతో దేశం గజగజా వణుకుతోంది. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 8380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఒకేరోజు 8000కు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,82,413కు చేరింది. 
 
దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,164కు చేరింది. మరోవైపు ప్రజల్లో కరోనాకు సంబంధించి పూర్తి అవగాహన ఏర్పడింది. కరోనా ప్రమాదకరమే అయినప్పటికీ మరణాల రేటు తక్కువగా ఉండటంతో రోడ్లపై జన సంచారం ఎక్కువ అయింది. 65 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారు కరోనా భారీన పడితే మృతి చెందే అవకాశాలు ఎక్కువని తేలింది. దేశవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సేవలు, పరిశ్రమలు తెరవబడ్డాయి. ఈ కారణాల వల్ల ప్రజల్లో కరోనాపై భయం తగ్గింది. 
 
మరోవైపు డాక్టర్లు మాత్రం ప్రజలకు తీవ్రమైన హెచ్చరికలే జారీ చేస్తున్నారు. డిసెంబర్ చివరి నాటికి దేశంలో సగం మంది కరోనా భారీన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా సోకిన వారిలో 90 శాతం మందిలో లక్షణాలు కనిపించవని... 5 నుంచి 10 శాతం మందికి మాత్రమే ఐసీయూలో చికిత్స అవసరమని ... జూన్ నుంచి వైరస్ విజృంభిస్తుందని... కేసుల సంఖ్య భారీగా పెరగనుందని బెంగళూరుకుకు చెందిన న్యూరో వైరాలజీ చీఫ్ డాక్టర్ రవి వ్యాఖ్యలు చేశారు. 
 
ఎబోలా, సార్స్ తో పోలిస్తే కరోనా డేంజర్ కాదని.... వ్యాక్సిన్ వచ్చినా కరోనా కొన్ని సంవత్సరాల పాటు ఉంటుందని చెబుతున్నారు. మన దేశంలో మరణాల రేటు 3 నుంచి 4 శాతం ఉండగా గుజరాత్ లో మాత్రం 6 శాతం ఉంది. ఇతర దేశాల్లో మాత్రం కరోనా మరణాల రేటు 5 నుంచి 9 శాతం ఉంది. వైద్యులు ప్రస్తుతం పబ్లిక్ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని.... మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: