విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ఒంటరివాడైన ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యలతో భ‌ర‌త్ స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్టుగానే ఉంది. భ‌ర‌త్ లోక్‌ల్‌గా పార్టీ త‌ర‌పున పోటీ చేస్తోన్న క్యాండెట్ల‌ను కాద‌ని త‌న సొంత టీంనే న‌మ్ముకుని రాజ‌కీయం చేస్తున్న‌ట్టుగా ఉంది. పార్టీ త‌ర‌పున పోటీ చేస్తోన్న క్యాండెట్లు, పార్టీలో సీనియ‌ర్ నాయకుల‌ను ఎవ్వ‌రిని భ‌ర‌త్ పూర్తిగా న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్న గుస‌గుస‌లే స్థానికంగా న‌డుస్తున్నాయి.


దీనికి తోడు భ‌ర‌త్ ఒంటెద్దు పోక‌డ‌ల‌తో పార్టీ నేత‌లు కూడా విసిగి వేసారిపోతోన్నారు. పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో ఉన్న నేత‌లు, ఇటు ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తోన్న కూట‌మి నాయకుల‌ను కాద‌ని... త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా వెళుతుండ‌డం ఎవ్వ‌రికి మింగుడు ప‌డ‌డం లేదు. ఇక నియోజ‌క‌వ‌ర్గాల వారీగా త‌న వాళ్ల‌ను మాత్ర‌మే పిలుస్తూ... వాళ్ల‌తోనే క‌లిసి న‌డుస్తోన్న ప‌రిస్థితి. భ‌ర‌త్ తీరుతో విసిగిపోయిన నేత‌లు చివ‌ర‌కు ఆయ‌న్ను లెక్క చేయ‌డం, ప‌ట్టించుకోవ‌డం కూడా మానేశారు.


భీమిలిలో పోటీ చేస్తోన్న మాజీ మంత్రి, పార్టీ సీనియ‌ర్ నేత గంటా శ్రీనివాస‌రావును సైతం క‌లుపుకుని వెళ్ల‌క‌పోవ‌డంతో గంటా తాను కూడా త‌న ప‌ని చేసుకుంటూ భీమిలిలో త‌న ఎమ్మెల్యే ఓటు వ‌ర‌కు ట్రై చేసుకుంటున్నాడ‌ని టీడీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటోన్నారు. ఇక ఎస్‌. కోట‌లో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి వ‌చ్చిన మెజార్టీతోనే భ‌ర‌త్ స్వ‌ల్ప తేడాతో ఓడిపోయాడు. ఇప్పుడు అక్క‌డ టీడీపీ అభ్య‌ర్థి కోళ్ల ల‌లిత కుమారికి భ‌ర‌త్‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. న‌గ‌రంలో మ‌రో ఇద్ద‌రు పార్టీ అభ్య‌ర్థుల‌ను భ‌ర‌త్‌కు అంత స‌ఖ్య‌త లేదంటున్నారు.


ఇదిలా ఉంటే విశాఖ‌లో నార్త్ ఇండియాన్లు, బీజేపీ అభిమానులు బాగా ఎక్కువ‌. వీరంతా త‌మ బీజేపీకి సీటు రాలేద‌ని ఇప్పుడు భ‌ర‌త్‌కు సైడ్ అయిపోతున్నారు. జీవీఎల్‌కు సీటు రాక‌పోవ‌డంతో ఇక్క‌డ బీజేపీ వాళ్లు త‌మ‌కు న‌చ్చిన పార్టీల్లోకి వెళ్లిపోవ‌డ‌మో లేదా సైలెంట్‌గా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డ‌మో మొద‌లు పెట్టేశారు. విచిత్రం ఏంటంటే గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు వ‌చ్చిన ఓట్లు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతాయ‌ని భ‌ర‌త్ పెట్టుకున్న ఆశ‌లు అడియాస‌ల‌య్యేలా క‌నిపిస్తున్నాయి.


ఏదేమైనా రెండు నెల‌ల ముందు వ‌ర‌కు విశాఖ‌లో వైసీపీ ఝాన్సీ, టీడీపీ భ‌ర‌త్ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌నుకున్న అంచ‌నాలు కాస్తా ఇప్పుడు క్ర‌మ‌క్ర‌మంగా వైసీపీ వైపు ఆధిక్యం ట‌ర్న్ అవుతోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. చాలా ద‌శాబ్దాల త‌ర్వాత ఇక్క‌డ కాపుల‌కు సీటు ఇవ్వ‌డం.. పైగా లోక‌ల్ అంశం ఇవ‌న్నీ ఝాన్సీకి బాగా ప్ల‌స్ అవుతున్నాయి. ఇక భ‌ర‌త్ ఒంటెద్దు పోక‌డ‌లు, సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో వాళ్లు కూడా లైట్ తీస్కొని త‌మ ఎమ్మెల్యే ఓటు వ‌ర‌కు అడుగుకుంటూ వెళ్లిపోతున్నారు. దీంతో భ‌ర‌త్ విశాఖ పార్ల‌మెంటు పోరులో ఒంటరి పోరు స‌లప‌డం మిన‌హా చేసేదేం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: