ఆమ్ ఆద్మీ పార్టీ గత కొన్ని రోజులుగా జగన్ సర్కార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. వాస్తవానికి గతంలో ఆప్ టీడీపీతో అత్యంత సన్నిహితంగా మెలిగింది. ఆప్ ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో చంద్రబాబు ఆదుకున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ విమర్శలు చేసింది. బీజేపీ చేసిన విమర్శలు నిజమో అబద్దమో ఎవరూ చెప్పలేరు. 
 
అయితే టీడీపీతో అంత సన్నిహితంగా మెలిగిన ఆప్ ప్రస్తుతం జగన్ కు సన్నిహితంగా మెలుగుతూ టీడీపీకి షాక్ ఇస్తోంది. కొన్నిరోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ జగన్ సర్కార్ కరోనా విషయంలో తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటూ ప్రశంసించింది. తాజాగా జగన్ సర్కార్ అమలు చేస్తున్న నాడు నేడు కార్యక్రమం గురించి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలు ప్రశంసలు వ్యక్తం చేశారు. 
 
ఆమ్ ఆద్మీ పార్టీ సంబంచించిన నాయకులు గత కొన్ని రోజులుగా ప్రశంసలతో జగన్ సర్కార్ ను ముంచెత్తుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అందుతున్న నివేదికల ఆధారంగానే ఈ తరహా వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆప్ కు టీడీపీకి స్నేహం చెడిందా....? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీకి నచ్చని వైసీపీకి ఆప్ అభినందించటం గమనార్హం. కేజ్రీవాల్ ను పొగుడుతూ జగన్ పై టీడీపీ గతంలో విమర్శలు చేసింది. 
 
కానీ ఆప్ జగన్ ని పొగుడుతుంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆప్ జగన్ సర్కార్ ను పొగడటం వెనుక ఇతర కారణాలేమైనా ఉన్నాయా...? అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు ఢిల్లీలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఢీల్లీలో ఇప్పటివరకు 70,000కు పైదా కేసులు నమోదు కాగా 2,500కు చేరువలో ఉంది.                        

మరింత సమాచారం తెలుసుకోండి: