మరికొన్ని రోజుల్లో ఇతర దేశాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడానికి ఇంకెంతో కాలం పట్టదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు కరోనా వ్యాక్సిన్ గురించి అధికారికంగా ప్రకటన చేశారు. పుతిన్ తన ఇద్దరు కూతుళ్లలో ఒకరికి వ్యాక్సిన్ ఇచ్చామని... ఆమె శరీరంలో యాంటీ బాడీలు పెరిగాయని అన్నారు.
తమ దేశంలో తయారైన వ్యాక్సిన్ కు రెండేళ్ల వరకు కరోనా వైరస్ సోకకుండా నిరోధించే శక్తి ఉందని చెప్పారు. తమ దేశంలో తయారైన వ్యాక్సిన్లకు అన్ని పరీక్షలు నిర్వహించామని... వ్యాక్సిన్ సమర్థవంతమైనదిగా నిరూపించబడిందని చెప్పారు. అయితే నిపుణులు రష్యా కరోనా వ్యాక్సిన్ గురించి అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదైనా వ్యాక్సిన్ కు మూడు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలంటే నెలల తరబడి సమయం పడుతుందని అన్నారు.
మరికొందరు శాస్త్రవేత్తలు సురక్షితం కాని వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రష్యా వ్యాక్సిన్ కు ఆమోదం తెలపలేదని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి తరిక్ జసరేవిక్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ గురించి రష్యా ఆరోగ్య శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ గురించి నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి