రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయిన వైసీపీ లో వర్గ విభేదాలు రోజు రోజు కి ఎక్కువయి పోతున్నాయి.. ముఖ్యంగా వైసీపీ కొంత బలహీనంగా ఉన్న చోట పార్టీ ప్రతిష్ట ని దెబ్బతీసేందుకు నేతలు ఎలాంటి సాహసాన్నైనా చేస్తున్నారు.. పార్టీ లోని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్న లెక్క చేయకుండా తమ స్వార్ధం కోసం పార్టీ ని వాడుకుని ప్రతిష్టని దిగజార్చుతున్నారు.. టీడీపీ లో వర్గ పోరే ఈ దుస్థితి కి కారణమని తెలిసినా పార్టీ లో ఇలా జరగడం కొంత ఆందోళనను గురిచేస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.. ఇక అనంత‌పురం జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం శింగ‌న‌మ‌లలో  ఈ వర్గపోరు కొంత ఎక్కువవుతుందట..

గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ నాయ‌కురాలు జొన్నల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి కి సొంత నియోజకవర్గంలో విచిత్ర మైన పరిస్థితులు ఎదురవుతుందట.. ఇక్కడ సీనియర్ టీడీపీ నేతలైన జేసీ దివాకర్ రెడ్డి లను ఎదురించి వారిపై చేయకూడని విమర్శలు చేసి మరీ సీటు నెగ్గింది.. త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో కూడా మంత్రి గా ఆమెకు ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. టీడీపీ అభ్యర్థి, అప్పటి ప్రభుత్వ విప్ యామినీ బాల‌పై జొన్నలగడ్డ తీవ్ర విమ‌ర్శలు సైతం గుప్పించారు. అబివృద్ది అంటే.. తిని ప‌డుకోవ‌డం కాదంటూ మీడియా ముందు తీవ్ర విమ‌ర్శలు చేశారు. పార్టీ త‌ర‌ఫున కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇక‌, జ‌గ‌న్ పాదయాత్ర చేసిన స‌మ‌యంలో జిల్లాలో ఆయ‌న ప‌ర్యటించిన‌ప్పుడే ఆమె జ‌గ‌న్ దృష్టిని ఆక‌ర్షించారు.

అయితే అప్పట్లో వైసీపీ ని బలోపేతం చేయడానికి టీడీపీ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ శ‌మంత‌క‌మ‌ణి, ఆమె కుమార్తె, మాజీ విప్ యామినీ బాల‌ల‌ను వైసీపీలోకి తీసుకువ‌చ్చారు. అయితే ఇప్పుడు ఆమెనుంచే పద్మావతి కి తలనొప్పులు మొదలయ్యాయట.. యామిని  వైసీపీలో జొన్నలగడ్డ పద్మావతికి వ్యతిరేకంగా ఉన్నవారిని కూడ‌గ‌డుతూ చాప‌కింద నీరులా గ్రూపు రాజ‌కీయం చేస్తున్నార‌ట‌. మరి ఈమెకు  జొన్నల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి ఏవిధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: