ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ గురించి రోజురోజుకు సరి కొత్త విషయం వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు ఈ మహమ్మారి వైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు పరిశోధనలు జరుగుతున్నట్లు గానే మరోవైపు ప్రజలకు మరింత అవగాహన పెంచేందుకు ఈ వైరస్ వ్యాప్తి పై ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక రోజు రోజుకు పరిశోధనల్లో  ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవలి అధ్యయనంలో మరోసారి కొత్త విషయం కూడా వెలుగులోకి వచ్చింది.



 అయితే ప్రస్తుతం వైరస్ ను నియంత్రించడానికి చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఉపరితలాలను కూడా క్రిమిరహితం చేయడం ఎంతో ముఖ్యం అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సహా అందరూ వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. కానీ మనిషి శరీరం బయట వైరస్ ఎంతకాలం ఉంటుంది అన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. తాజాగా ఈ విషయంపై జపాన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మానవ శరీరంపై 9 గంటల వరకు వైరస్ మనుగడ కొనసాగుతుందని జపాన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇక సాధారణ ఫ్లూ కి  కారణమయ్యే వైరస్ మానవ శరీరంపై 1.8 గంటలు మాత్రమే జీవించి ఉంటుంది అంటూ తెలిపిన జపాన్ శాస్త్రవేత్తలు... సాధారణ ఫ్లూ వైరస్ తో పోల్చి చూస్తే కరోనా  వైరస్ ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ కాలం మనిషి శరీరంపై మనుగడ సాగిస్తుంది అంటూ తెలిపారు.



 ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఒకరోజు తర్వాత శవ పరీక్షల నమూనాలు సేకరించి చర్మ పరిశోధనా బృందం అధ్యయనం నిర్వహించింది. కరోనా, ఫ్లూ వైరస్ లు రెండు శానిటైజర్ ల తయారీలో వాడే ఇథనాల్  ఉపయోగించడం వల్ల 15 సెకన్లలోనే అంత అవుతాయని వెల్లడయింది. మానవ చర్మం పై ఎక్కువ కాలం కరోనా  వైరస్  మనుగడ ఉంటుంది అన్న విషయం కూడా బయటపడింది. అందుకే తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: