రాజకీయాల్లో ఏది చేయాలన్న కొంత కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి.. వాస్తవానికి అది ఇక్కడే కాదు ఎక్కడైనా వర్తిస్తుంది. అయితే రాజకీయాల్లో మాత్రం సుడి ఉంటేనే ఇక్కడ రాణిస్తారు.. లేదంటే క్షణాల్లోనే కనుమరుగైపోతారు. ఒక నిర్ణయం తమ రాజకీయ జీవితాన్నే మారుస్తుంది అనడానికి అచ్చెన్నానే ఉదాహరణ.. మొన్నటిదాకా జైలునుండి వస్తాడో రాడో అనుకున్న అచ్చెన్న సడెన్ గా టీడీపీ అధ్యక్షుడయిపోయాడు బాగానే సెటిల్ అయ్యాడు..  ఇటీవలే టీడీపీ పార్టీ కి అధ్యక్షుడ య్యాడు అచ్చెన్నాయుడు.. అయితే పదవి చేపట్టగానే కొంత హడావుడి చేసే ప్రయత్నంలో అచ్చెన్న వైసీపీ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు..

స్థానిక ఎన్నికల విషయంలో వైసీపీ ని విలన్ చేసే ప్రయత్నం చేశారు అచ్చెన్నా... దాంతో చంద్రబాబు రాజకీయం అచ్చెన్న కు బాగ్ వంటపట్టింది అంటున్నారు.. చంద్రబాబు కూడా ద్వంద్వ వైఖరి ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థి ని తికమక పెట్టడం అలవాటు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ని తమ అధీనంలో ఉంచుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తూనే మరో వైపు జగన్ పై తప్పులని రుద్ది జగన్ ను బ్యాడ్ చేసే పని చేస్తున్నారు.. స్థానిక ఎన్నికలు పెట్టాలని అచ్చెన్నాయుడు కోరుతుంటే చంద్రబాబు నిర్ణయం మాత్రం వేరేలా ఉంది..

ఇక రాష్ట్రంలో కోవిడ్‌ వల్ల భవిష్యత్‌ భయంకరంగా ఉండబోతోందని హెచ్చరించారు. రాష్ట్రంలో కోవిడ్‌ వల్ల భవిష్యత్‌ భయంకరంగా ఉండబోతోందని హెచ్చరించారు. చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో కరోనా అధికంగా ఉంటుందన్నారు. భవిష్యత్‌ లో కరోనా వల్ల భయంకరమైన పరిస్థితులు ఉండే ప్రమాదం ఉందని చంద్రబాబు హెచ్చరించారు.. ఈ నేపథ్యం లో  చంద్రబాబు ఇలా హెచ్చరిస్తుంటే.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని డిమాండ్‌ చేస్తుండడం టీడీపీ అనుసరిస్తున్న ద్వంద విధానానికి అద్దం పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: