గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అధికారం చేపట్టే అవకాశం మళ్లీ టీడీపీకి ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు, నాయకుల్లోనూ కనిపిస్తుంది. మొన్నటి వరకు టిడిపి నుంచి పెద్ద ఎత్తున వైసీపీలోకి వలసలు జరిగేవి. అయితే కొద్ది రోజులుగా ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీలో కొత్త కమిటీల నియామకం చేపట్టడమే కారణంగా తెలుస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలతో పాటు, రాష్ట్ర కమిటీలలో భర్తీ చేపట్టారు. అలాగే పొలిట్ బ్యూరో ను సైతం చంద్రబాబు ప్రక్షాళన చేసి ఎవరూ ఊహించని విధంగా నియామకాలు చేపట్టారు. దీంతో గతంతో పోలిస్తే టిడిపిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఏపీ సీఎం జగన్ బీసీలను ఆకట్టుకునేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుండడంతో, చంద్రబాబు కూడా ఈసారి పార్టీ కమిటీల నియామకం లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. దీంతో బీసీలలో టిడిపిపై కాస్త ఆదరణ పెరిగినట్టుగా కనపిస్తోంది. అక్కడ అక్కడ ఈ కమిటీల నియామకం పై కాస్త అసంతృప్తి ఉన్నా, కలిసొచ్చే అంశాలు టీడీపీకి ఎక్కువగా ఉన్నాయి. 



ఇదిలా ఉంటే, కొత్తగా నియమితులైన నేతలు టీడీపీ తరుపున వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేసేందుకు,  పెద్ద ఎత్తున నిధులు కొరత ఉండటంతో, వారు నాయకత్వం వహించేందుకు కాస్త వెనకడుగు వేస్తున్నారట. దీనికి కారణం గత ఎన్నికల్లో చాలా మంది నేతలు పోటీ చేసి ఓటమి చెందారు. మళ్లీ ఇప్పుడు భారీగా సొమ్ములు ఖర్చు పెట్టాలంటే, ఎలా అంటూ వెనుక, ముందు ఆడుతున్నారట. దాదాపు పది  నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉండడంతో చంద్రబాబు ఈ విషయం సీరియస్ గానే తీసుకున్నారు. 


పార్టీ పిలుపు ఇచ్చిన అంశాలపై పోరాటం చేయాలని, ఆర్థికంగా ఎవరూ వెనకడుగు వేయవద్దని, కేంద్ర కమిటీ ఖర్చులను భరిస్తుంది అంటూ, చంద్రబాబు భరోసా ఇవ్వడంతో, నాయకుల్లో ఉత్సాహం పెరిగిందట. ఇకపై అన్ని అంశాలను పూర్తిగా పక్కన పెట్టి, ప్రజా పోరాటాల పైన దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించడంతో తమ ప్రతాపం చూపించేందుకు కొత్తగా పదవులు పొందిన నాయకులు సిద్ధమవుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: